వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే డీహైడ్రేషన్ సమస్యలే కాకుండా, నీరసం, వడదెబ్బ వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా శరీర వేడి వల్ల జీర్ణ సమస్యలు, చర్మంపై దద్దుర్లు, మొటిమలు, రక్తపోటు, తలనొప్పి, కళ్లు తిరగడం, గుండె వేగం పెరగడం వంటివి కూడా వస్తాయి. కాబట్టి ఎండల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి వేసవిలో తాగే డ్రింక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని రోజూ మీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
నిమ్మరసం:
వేసవిలో తల తిరగడం సమస్యను అధిగమించడానికి నిమ్మరసం మంచిది. ఇది తయారు చేసేటప్పుడే అందులో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఎందుకంటే నిమ్మలో విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఉన్నాయి. అవి మన శరీరాన్ని వేసవిలో కూడా చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. కావాలంటే నిమ్మరసంలో కొద్దిగా పుదీనా, అల్లం కలిపి తాగితే రుచిగా ఉండటమే కాకుండా శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
బొప్పాయి జ్యూస్:
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల్లో బొప్పాయి జ్యూస్ ఒకటి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్, పాపైన్ ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే ఇన్ని లాభాలా?
తులసి జ్యూస్:
వేసవి వేడి నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవడానికి తాగాల్సిన మరో పానీయం తులసి జ్యూస్. ఈ పానీయం చలికాలానికే కాదు.. వేసవిలో వచ్చే జలుబు సమస్యను కూడా నయం చేస్తుంది. ఇది రోజూ తాగితే శరీర వేడి తగ్గుతుంది.
దీన్ని కూడా చదవండి: రోజుకో ఆరెంజ్ తింటే నెలకే ఈ 4 సమస్యలు తీరిపోతాయి
చెరకు రసం:
వేసవి కాలం వచ్చిందంటే అందరికీ మొదట గుర్తొచ్చేది చెరకు రసమే. ఈ సీజన్‌లో ఎక్కడ పడితే అక్కడ చెరకు రసాలు అమ్మడం మీరు చూసే ఉంటారు. ఈ డ్రింక్ మన శరీరాన్ని ఈ ఎండకు హాయిగా ఉంచుతుంది. చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. శరీరానికి కావాల్సిన నీటిని కూడా అందిస్తాయి.
పండ్ల రసాలు:
ఆయా సీజన్లలో పండే పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి వేసవిలో పండే అన్ని రకాల పండ్లను జ్యూస్ చేసి తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో పుచ్చకాయ, దానిమ్మ, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీర వేడిని కూడా తగ్గిస్తాయి.