చలికాలంలో టేస్టీ వేడి వేడి సూప్.. ఇంట్లోనే ఇలా చెయ్యండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 14, 2021, 12:26 PM IST

శీతాకాలంలో (Winter season) చలిగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది. శీతాకాలంలో ఆహారం (Food) తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అలాంటి వారికి కూరగాయలతో సూప్ చేసి ఇవ్వండి. ఇది వారికి ఎంతగానో నచ్చుతుంది. చలిని ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఈ సూప్ లు శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వేడివేడిగా తయారు చేసుకునే సూప్ ల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
15
చలికాలంలో టేస్టీ వేడి వేడి సూప్.. ఇంట్లోనే ఇలా చెయ్యండి!

వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసము తగ్గిపోతుంది. సూప్ ఒత్తిడిని (Stress) తగ్గించి హృదయాన్ని తేలికపరుస్తుంది. ఆకలిని (Hunger) పెంచుతుంది. చలికాలంలో వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందేలా చేస్తాయి. ఈ సూప్ ల తయారీకి ఉపయోగించే మిరియాలు, పసుపు, అల్లంవెల్లుల్లి జలుబు, దగ్గులను  తగ్గిస్తాయి.
 

25

టమోటా, క్యారెట్ సూప్:
కావలసిన పదార్థాలు : 3 క్యారెట్లు (Carrots), 3 టమోటాలు (Tomato), 1 ఉల్లిపాయ (Onion), 1 స్పూన్ మిరియాలపొడి (Pepper powder), 1 స్పూన్  జీలకర్రపొడి (Cumin powder), కొత్తిమీర (Coriyander), ఉల్లికాడల తరుగు (Spring onions), తగినంత ఉప్పు (Salt).
 

35

తయారీ విధానం: టమోటా, క్యారెట్, ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు రెండు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తరువాత అందులో మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర వేసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివరిలో కొత్తిమీర, ఉల్లికాడల తరుగు వేసి దింపేయాలి. వేడి వేడి క్యారెట్, టమోటా సూప్ రెడీ (Ready). ఈ సూప్ (Soup) శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది.
 

45

స్వీట్ కార్న్, పాలకూర సూప్:
కావలసిన పదార్థాలు: ఒక కప్పు స్వీట్ కార్న్ (Sweet corn), సగం కప్పు పాలకూర(Lettuce), ఒక స్పూను వెల్లుల్లి (Garlic) తరుగు, తగినంత ఉప్పు (Salt), సగం స్పూన్ మిరియాల పొడి (Pepper powder), రెండు స్పూన్ ల నెయ్యి (Ghee), కొంచెం క్రీం (Cream).

55

తయారీ విధానం: స్టౌ పైన కడాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత స్వీట్ కార్న్ వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తరువాత అందులో రెండు గ్లాసుల నీళ్ళు (Water) పోసి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి దించేయాలి. ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్ ను మిక్సీలో వేసి పేస్ట్ (Paste) లా తయారు చేసుకోవాలి. ఇంకోసారి మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ ను గిన్నెలో తీసుకుని ఇందులో పాలకూర తరుగు, వెల్లుల్లి వేసి మరల ఉడికించాలి. ఇది కాస్త ఉడికిన తరువాత ఇందులో క్రీం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా స్వీట్ కార్న్, పాలకూర సూప్ రెడీ.

click me!

Recommended Stories