క్రిస్పీ టేస్టీ ఎగ్ సమోసాలు ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి.!

First Published Nov 13, 2021, 8:21 PM IST

చలికాలంలో, వర్షాకాలంలో టీ తో వేడివేడిగా క్రిస్పీగా ఒక మంచి స్నాక్స్ (Snacks) తినాలనిపిస్తుంటుంది. మనం ఎప్పుడూ ఆలు సమోసా, వెజిటేబుల్ సమోసా ట్రై చేసి ఉంటాం. అయితే కొత్తగా వెరైటీగా ఎగ్ సమోసాను ట్రై చేసి చూడండి. ఇది మీకు, మీ పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది. వేడివేడి క్రిస్పీ ఎగ్ సమోసా తింటూ చల్లటి సాయంత్రపు వేళను ఆస్వాదించండి.  అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా క్రిస్పీ (Crispy) టేస్టీ ఎగ్ సమోసా (Egg Samosa) తయారీ విధానం గురించి తెలుసుకుందాం. 
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదాపిండి (Maida), మూడు ఉల్లిపాయలు (Onions), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), కారం (Red chilie powder), పసుపు (Turmeric), ఉప్పు (Salt), గరంమసాలా (Garam masala), జీలకర్ర పొడి (Cumin powder), చాట్ మసాలా (Chat masala), తగినంత ఉప్పు (Salt), తరిగిన కొత్తిమీర (Coriyander), 4గుడ్లు(Eggs), నూనె (Oil), ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste) టమాట సాస్ (Tomato sauce).
 

తయారీ విధానం: ఒక కప్పు మైదా పిండిని (Maida Flour) ఒక గిన్నెలో (Bowl) తీసుకుని ఇందులో కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న పిండిని 15 నిముషాలు పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో నీళ్ళు పోసి ఉప్పు వేసి నాలుగు గుడ్లను ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న గుడ్లను (Boiled eggs) తొక్కతీసి పక్కన పెట్టుకోవాలి.
 

ఇప్పుడు సమోసాలో నింపడానికి కావలిసిన మసాలాను (Masala) తయారు చేసుకుందాం. అందుకు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి  అందులో పోపుకు సరిపడా నూనె (Oil) పోసి నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలపాలి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఉడికించుకోవాలి.
 

అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు మగ్గించాలి. ఇందులో ఉడికించి ముక్కలు చేసుకున్నా ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. ఇందులో తగినంత కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మసాల పొడులు (Masala powders) అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. చివరగా కట్ చేసి పెట్టుకొన్న కొత్తిమీరను వేసి కలపాలి. ఇప్పుడు సమోసా (Samosa) లో నింపడానికి కావాల్సిన మసాలా రెడీ.
 

ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పిండిని తీసుకుని పలుచగా తిక్కి త్రికోణ ఆకృతిలో (Triangle shape) కత్తిరించుకుని, అందులో ఎగ్ మిశ్రమాన్ని నింపాలి. మరొక కడాయిలో నూనె వేసి వేడిక్కిన తరువాత తయారు చేసిన సమోసాలను నూనెలో వేసి గోల్డ్ కలర్ (Gold colour) వచ్చేంత వరకు వేయించాలి. అంతే వేడి వేడి ఎగ్ సమోసా రెడీ. వీటిని ఒక ప్లేట్లో పెట్టి టమోటా సాస్ తో మీ పిల్లలకు సర్వ్ చేయండి.

click me!