పైల్స్ నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు.. జాగ్రత్తలు ఇవే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 12, 2021, 02:11 PM IST

ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుగుల జీవితంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఫైల్స్. ఇది సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో మార్పుల వల్ల అందరిలో పైల్స్ (Piles) ఏర్పడుతున్నాయి. ఈ ఆర్టికల్ (Article) ద్వారా పైల్స్ నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.  

PREV
16
పైల్స్ నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు.. జాగ్రత్తలు ఇవే!

ఫైల్స్ రావడానికి ముఖ్య కారణం కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాలు, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు దీనికి ముఖ్య కారణం. పైల్స్ ను మొలలు అని కూడా అంటారు. ఇది అందరిలో కనిపించే సర్వసాధారణ సమస్య. మనం తీసుకునే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్స్ (Fast foods), వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం (Meat) తరుచుగా తినటం వలన పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
 

26

పైల్స్ ఉన్నప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి తీవ్రమైన తలనొప్పి (Headache), మంట, మలవిసర్జన సాఫీగా జరుగదు. మలంలో రక్తం పడడం, మలవిసర్జన అనంతరం కూడా కొద్దిగా నొప్పి మంట ఉంటుంది. మల విసర్జన సాఫీగా జరుగదు. దాంతో ఇబ్బంది కలిగిస్తుంది. మలవిసర్జన సాఫీగా జరగక చికాకుగా ఉంటుంది. మలవిసర్జన సమయంలో మొలలు బయటకు పొడుచుకుని వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి తగిన చికిత్స (Treatment) తీసుకోవడం అవసరం.
 

36

దానిమ్మ: దానిమ్మ పైల్స్ నివారణకు చక్కటి ఔషధంగా (Medicine) పనిచేస్తుంది. ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో దానిమ్మ తొక్కను (Pomegranate skins) వేసి బాగా ఉడికించాలి. ఇలా బాగా మరిగించి ఉడికించిన నీటిని వడగట్టి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడంతో పైల్స్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.
 

46

అంజీర పండు: మలబద్ధకం సమస్యను తగ్గించడానికి అంజీర పండు (Figs) చక్కగా పనిచేస్తుంది. అంజీర పండ్లు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.ఈ నీటిని రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం తాగితే పైల్స్ వ్యాధి (Piles problems) నయమైపోతుంది.
 

56

అల్లం నిమ్మరసం జ్యూస్: అల్లం (Ginger), నిమ్మరసం (Lemon juice), తేనె (Honey) కలిపిన జ్యూస్ ను రోజూ తీసుకుంటే ఫైల్స్ ను తగ్గించుకోవచ్చు. పైల్స్ రావడానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. ఈ జ్యూస్ శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. దాంతో ఫైల్స్ సమస్య  తగ్గుముఖం పడుతుంది. ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

66

పచ్చి ఉల్లిపాయ రసం: పచ్చి ఉల్లిపాయ జ్యూస్ (Onion juice) ను క్రమం తప్పకుండా వాడటంతో మలంలో రక్తం (Blood) పడటాన్ని తగ్గిస్తుంది. దీంతో నొప్పి తగ్గుతుంది. పచ్చి ఉల్లిపాయ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడంతో ఫైల్స్  సమస్యను తగ్గించుకోవచ్చు. ఫైల్స్ సమస్యలను మొదట్లోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

click me!

Recommended Stories