చలికాలంలో రాత్రిపూట అరటిపండు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

First Published Nov 18, 2022, 6:34 PM IST

సాధారణంగా అందరూ ఇష్టపడి తినే పండ్లలో అరటిపండు ఒకటి. అయితే చలికాలంలో అరటిపండును రాత్రిపూట తినడం వల్ల శ్వాస కోసం సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.
 

మనకు కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో పుష్కలంగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి.ఎన్నో పోషక విలువలతో కూడి ఉన్నటువంటి అరటిపండును ప్రతిరోజు ఒకటి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. విటమిన్స్ మినరల్స్, పొటాషియం, ఫైబర్స్, ఖనిజ లవనాలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభించే అరటిపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి అరటి పండ్లను తినడం వల్ల మనకు రోజంతా ఎంతో ఎనర్జీని కలిగి ఉంటుంది.ఇక అరటి పండులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో హానికర బ్యాక్టీరియాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా శరీరంలో క్యాన్సర్ కారకాలను నశింపచేస్తాయి. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ను సైతం బయటకు పంపిస్తాయి. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి దోహదపడతాయి.

అరటిపండులో ఉన్నటువంటి ప్రోబయాటిక్ మన శరీరంలో క్యాల్షియంని తీసుకొని ఎముకలు దృఢంగా పటిష్టంగా తయారు కావడానికి దోహదపడుతుంది.ఇలా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి అరటి పండును చలికాలంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. చలికాలంలో అరటి పండు తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలుతుతాయనే విషయానికి వస్తే..
 

అరటి పండును చలికాలంలో రాత్రిపూట తినడం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలు అధికమయ్యే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.అయితే ఎవరైతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు సాయంత్రం 6 గంటల తర్వాత అరటిపండును పూర్తిగా దూరం పెట్టడం ఎంతో మంచిది.ఇలా చలికాలంలో అరటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధులు మరింతగా భాదిస్తాయి. అందుకే చలికాలంలో అరటి పండు తినకపోవడం ఎంతో మంచిది.

click me!