Health Tips: ఇప్పుడిప్పుడే వేసవి వేడి నుంచి బయటపడి తొలకరి వర్షాలకి ఒళ్ళు కాస్త ఉపసమిస్తుంది. అయితే ఈ వర్షా కాలంలో పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
వేసవి తాపంతో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే వర్షాలు పడటంతో కాస్త ఉపసమిస్తున్నారు. కానీ ఈ వర్షాల వల్ల వచ్చే ప్రమాదాల నుంచి మా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. వర్షంలో తడవటం అంటే పిల్లలకే కాదు మనకే ఎంతో ఇష్టం.
26
అలాంటిది పిల్లలు వర్షంలో తడుస్తామంటే వద్దనలేము, మానలేము. వర్షంలో పిల్లలు ఎక్కువగా తడవటం వలన జలుబు దగ్గు తుమ్ములు అంటే సాధారణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఈ సమయంలో వచ్చే ప్రమాదకరమైన జబ్బు డయేరియా.
36
అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది ఈ డయేరియా. అలాగే టైఫాయిడ్, శ్వాస సంబంధమైన వ్యాధులతో కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి అలాంటి వ్యాధులు రాకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.
46
వర్షాకాలంలో తప్పనిసరిగా కాచి మరగపెట్టిన నీళ్లనే పిల్లలకి ఇవ్వండి. అలాగే ఆహారం కూడా వేడివేడిగా వడ్డించండి. బయట చిరుతిళ్లు తినటానికి అస్సలు ఒప్పుకోకండి ఎందుకంటే బయట తడి వాతావరణం లో క్రిములు ఎక్కువగా ఉంటాయి.
56
అవి ఆహార పదార్ధాలు మీద వాడటం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అదే విషయాన్ని పిల్లలకి అర్థం అయ్యేలాగా చెప్పండి. పిల్లలని ఎక్కువగా కడుపు ప్రదేశాల్లో ఉంచకుండా పొడిగా ఉండే ప్రదేశంలో ఆడుకోమని చెప్పండి ముఖ్యంగా వాళ్ళ శరీరాన్ని కూడా పొడిగా ఉంచండి.
66
ఎందుకంటే తడిగా ఉండే ప్రదేశంలో దోమలు ఎక్కువగా ఉంటాయి అవి మన శరీరానికి హాని కలిగించడమే కాకుండా ఇన్ఫెక్షన్ రావటానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం.