ప్రాణాలు తీస్తున్న ఉల్లి.. నిజమేనా?

First Published | Aug 29, 2020, 2:19 PM IST

ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.
 

ఉల్లిపాయ లేకుండా వంట చేయడం సాధ్యమేనా..? ఏ రెండు, మూడు కూరలో తప్ప.. మిగిలినవి ఏది వండాలన్నా.. కచ్చితంగా ఉల్లిపాయ ఉండాల్సిందే. ఇక నాన్ వెజ్ కూరలు వండాలంటే.. ఉల్లిపాయ కావాల్సిందే. అది లేకుండా వండిన కూరు రుచి కూడా ఉండదు.
అంతేనా.. ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. అయితే.. ప్రస్తుతం అదే ఉల్లి తింటే మీ ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.
కాలిఫోర్నియాలోని థామ్సన్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ఉల్లిపాయలు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
థామ్సన్ ఇంటర్నేషనల్ నుంచి సరఫరా అవుతున్న ఉల్లిపాయల్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటోందట.
ఆ బ్యాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు తింటే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ఈ బ్యాక్టీరియా జంతువుల నుంచి సంక్రమిస్తుంట. అంతేకాదు.. ఇది మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు.
ఈ బ్యాక్టీరియా సోకిన ఉల్లి కనుక మనుషులు తింటే.. డయేరియా, వాంతులు, తీవ్రంగా జ్వరం, కడుపులో నొప్పి, రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులపై ఈ బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపిస్తుందట. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 1శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఓ సర్వేలో తేలింది.
సాధారణంగా ఈ బ్యాక్టీరియా నీరు, ఆహారం నుంచి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాగా.. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఉల్లిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.
కెనడా ప్రభుత్వం ఇప్పటికే ఆ ఉల్లిపాయలు వాడొద్దంటూ.. రెస్టారెంట్స్ , రీటైలర్ స్టోర్స్ కి ప్రకటన విడుదల చేసింది.
థామ్సన్ ఇంటర్నేషన్ లో పండే రెడ్, వైట్ , ఏ రంగు ఉల్లిపాయ అయినా వాడొద్దని కెనడా ప్రభుత్వం సూచించింది.
అయితే.. ఈ సమస్య మన దగ్గర లేకపోవడం సంతోషకరం. మన దగ్గర హాయిగా.. ప్రశాంతంగా ఉల్లిని తినేయవచ్చు.

Latest Videos

click me!