ఇంట్లో బల్లుల బెడద..? తరిమికొట్టే చిట్కాలు ఇవే..

First Published Aug 15, 2020, 1:43 PM IST

ముఖ్యంగా వంటింట్లో స్టవ్ కింద లేదా గోడల మీద ఇలాగ ప్రతి చోట బల్లులు తిరుగుతూనే ఉంటాయి అయితే ఇవి చూడటానికి చాలా చిరాగ్గా ఉంటాయి. 

బల్లి.. దీనిని చూస్తేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇక ఇవి ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటిని ఎలా వెల్లగొట్టాలా అని నానా తిప్పలు పడుతుంటారు. చాలా మంది ఇల్లు శుభ్రం గా లేకపోతేనే బల్లులు వస్తాయని భావిస్తుంటారు. అయితే... నిజానికి.. శుభ్రం గా ఉన్న ఇంట్లోకి కూడా బల్లులు ప్రవేశిస్తాయట.
undefined
అయితే ముఖ్యంగా వంటింట్లో స్టవ్ కింద లేదా గోడల మీద ఇలాగ ప్రతి చోట బల్లులు తిరుగుతూనే ఉంటాయి అయితే ఇవి చూడటానికి చాలా చిరాగ్గా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి చాలా హాని కూడా మరి ఇవి పోవాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాము.
undefined
కోడి గుడ్డు పెంకులు.. మొక్కల చుట్టూ బల్లులు ఎక్కువగా ఉంటాయి. దీనికి కోడి గుడ్డు పెంకు ఆ మొక్కల దగ్గర పెట్టి ఉంచాలి. దీనివల్ల బల్లులు ఆ దగ్గరకు రావు
undefined
వెల్లుల్లి.. దీని వాసన బల్లులకు అస్సలు నచ్చదు. వీటిని కనుక దంచి.. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెడితే.. అవి దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతాయి.
undefined
ఉల్లిపాయ రసం.. వెల్లుల్లి లాగే.. ఉల్లిపాయ రసం కూడా బల్లలకు అస్సలు నచ్చదట. అందకే ఉల్లిపాయ రసం చేసి.. దానిని బల్లులు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయాలి. అలా చేయడం వల్ల బల్లులు పారిపోతాయి.
undefined
చల్లటి నీరు.. మనకు దగ్గర్లో గోడమీద బల్లి వెళుతూ కనిపించిందే అనుకోండి.. వెంటనే దాని మీద చల్లటి నీరు పోయాలి. అప్పుడు అది వెంటనే కింద పడిపోతుంది. దానిని అప్పుడు మీరు తీసి.. బయటకు వెళ్లగొట్టే అవకాశం ఉంటుంది.
undefined
మిరియాలు( పెప్పర్ స్ప్రే).. మిరియాలు దంచి పెట్టినా.. లేదా పెప్పర్ స్ప్రే చల్లినా బల్లులు పోతాయట. వాటిని దాని ఘాటు వాసన తట్టుకోలేవట.
undefined
ఇంట్లో బల్లులు ఎక్కువగా కనపడే చోట కర్పూరం పొడి చేసి చల్లాలి. అలాగే పొడి చల్లలేని చోట కర్పూరం బిళ్ళలు పెడితే బల్లులు ఆ ఘాటు వాసనకి రావు. అలాగే ఆ ఘాటు వాసన పోయిన తరువాత మళ్ళి కొత్తవి వెయ్యాలి.
undefined
ఇంటి హల్లో లేదా బెడ్ రూమ్లో కనుక బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి అక్కడ నెమలి కన్ను ఉన్నది పెట్టాలి. అలాగే ఒకటి రెండు కాకుండా ఒక 4 లేదా 5 నెమలి కనులు ఉన్నవి పెడితే బల్లులు బయపడి ఆ చోటకి రావు. ఇంట్లో అక్కడక్కడ మిరియాలు చల్లిన సరే బల్లులు రావు.
undefined
లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి.ఆ వాసన వాటికి పడదు.లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో, అక్కడ కొన్ని చుక్కలు పోయండి. అలా కాదు అంటే లెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి.
undefined
click me!