పరగడుపున ఇలాంటి పనులు చేస్తున్నారా..?

First Published Sep 17, 2021, 1:04 PM IST

కాఫీలోకి కెఫైన్ అనే పదార్థం ఉంటుదనే విషయం మనకు తెలిసిందే. అది పరగడుపున పొట్టలోకి వెళితే.. యాసిడ్ ఫాం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తీసుకోవచ్చు.

రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత.. మళ్లీ ఉదయం లేచేంత వరకు మన శరీరంలోకి ఎలాంటి ఆహారం వెళ్లదు. కాబట్టి.. శరీరం కచ్చితంతగా ఎదైనా ఎనర్జీని కోరుకుంటుంది. ఎక్కువ గంటలు గ్యాప్ రావడం వల్ల.. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
 

అయితే.. మనలో చాలా మంది.. ఉదయం లేవగానే.. పరగడుపున ఏ టీనో, కాఫీనో తాగడం చేసేస్తుంటారు. లేదంటే ఆకలి బాగా వేడయం వల్ల ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటారు. అసలు నిజానికి పరగడుపున కొన్ని ఆహారాలు తీసుకోకూడదట. దాని వల్ల లాభాలు కాదు కదా.. ఎక్కువ నష్టాలు వచ్చే ప్రమాదం ఉందట. అలాంటి ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

coffee

చాలా మందికి ఉదయం లేవగానే.. పొట్టలోకి వేడి వేడి కాఫీ వెళ్లనిదే తెల్లారినట్లే అనిపించదు. అయితే.. కాఫీ తాగడం మంచిదే కానీ..  పరగడుపున మాత్రం దీనిని తీసుకోవడం అంత మంచిదేమీ కాదట. కాఫీలోకి కెఫైన్ అనే పదార్థం ఉంటుదనే విషయం మనకు తెలిసిందే. అది పరగడుపున పొట్టలోకి వెళితే.. యాసిడ్ ఫాం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తీసుకోవచ్చు.

రాత్రి భోజనం తర్వాత చాలా గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి. అంత గ్యాప్ తర్వాత.. అంటే పరగడుపున మద్యం తీసుకోకూడదు. దాని వల్ల మొత్తం మన శరీరం మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్పాలి. ఆల్కహాల్ మొత్తం బాడీలోకి ప్రవేశిస్తుంది. దాని వల్ల వాంతులు అవ్వడం.. నీరసం రావడం.. కిడ్నీ సమస్యలు లాంటివి వచ్చే ప్రమాదం ఉంది.

ఇక చాలా మంది.. ఉదయాన్నే చాక్లెట్స్ తినడం.. చూయింగ్ గమ్స్ లాంటివి తినడం చేస్తారు. అయితే.. అవి మంచిది కాదట.  చూయింగ్ గమ్స్ తినడం వల్ల.. అరుగుదల సమస్యలు వస్తుంటాయట. అంతేకాదు.. పొట్టలో యాసిడ్ తయారౌతుంది. కాబట్టి.. పరగడుపున చూయింగ్ గమ్స్ తినకూడదు.


ఇక పరగడుపున.. ముఖ్యంగా ఆకలిగా ఉన్న సమయంలో షాపింగ్ కి వెళ్లకూడదట. దీనికేంటి సంబంధం అనుకుంటున్నారా..? ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్  చేస్తే.. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినాలని , వాటినే కొనుగోలు చేస్తారట. హై క్యాలరీ ఫుడ్స్ కొనుగోలు చేసి వాటిని తినేస్తారు. కాబట్టి..  ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ చాలా డేంజరస్ అని గుర్తుంచుకోవాలి. 
 

అంతేకాదు.. ఆకలిగా ఉన్న సమయంలో వాదోపవాదనలు చేయకూడదు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆ సమయంలో వాదనలు చేస్తే మనకు తెలియకుండానే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. దాని వల్ల ఇతర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

click me!