కంటి చూపు మెరుగుపడాలా.. ఇవే బెస్ట్ ఫుడ్స్..!

Published : Sep 11, 2021, 03:19 PM IST

విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తినాలి. 

PREV
17
కంటి చూపు మెరుగుపడాలా.. ఇవే బెస్ట్ ఫుడ్స్..!
eyes

ప్రపంచవ్యాప్తంగా కంటిచూపు  సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో సరైన పోషకాలు అందక.. చిన్న పిల్లలు సైతం  కంటి సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. ఈ సమస్య నుంచి బలపడాలంటే.. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలనలి నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

27
eye disease

కంటి ఆరోగ్యానికి విటమిన్ లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కాబట్టి.. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తినాలి.

37

eye check up

ఇవి తినడం వల్ల..  కంటి సమస్యలు తగ్గుతాయట. అంతేకాకుండా.. సిట్రిక్ పండ్లు, కాయలు, విత్తనాలు, చేపలు వంటివి తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దాని వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

47

ఆకుకూరలు.. ఆకుకూరలు ఎక్కువగా తినేవారిలో కంటి చూపు మెరుగ్గా ఉంటుందట. ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్-సి, ఇ అధికం. 

57

 మొక్కల్లాంటి ఆకు కూరల్లో విటమిన్-ఎ శాతం ఎక్కువ. కాబట్టి.. మీరు తీసుకొనే డైట్‌లో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోండి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వయస్సు మీదపడినా సరే కంటి చూపు మందగించదు.
 

67
eyelash


కళ్లు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. పోషకాలతోపాటు విటమిన్-ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మస్క్యులర్ డీజనరేషన్  సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

77

పుల్లని పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్, ద్రాక్ష పండ్లు, నిమ్మ, బెర్రీస్‌లో ఇది లభిస్తుంది. ఇది కంటిశుక్లం , మాక్యులర్ క్షీణత సమస్య దరిచేరకుండా కళ్లను కాపాడుతుంది. ఇకపై మీ డైట్‌లో తప్పకుండా ఇవి ఉండేలా చూసుకోండి.

click me!

Recommended Stories