షుగర్ పేషెంట్స్ లో కడుపు నొప్పి.. ఎలా ఎదుర్కోవాలి

Published : Sep 03, 2021, 01:52 PM IST

రక్తప్రవాహంలోకి వచ్చే చక్కెర (గ్లూకోజ్) మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు ఈ  డయాబెటిక్ సమస్య తలెత్తుతుంది. 

PREV
19
షుగర్ పేషెంట్స్ లో కడుపు నొప్పి.. ఎలా ఎదుర్కోవాలి

ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే.. దాని నుంచి బయటపడటం అంత సులువేమీ కాదు. అంతేకాదు.. డయాబెటిక్స్ వచ్చిన తర్వాత.. పూర్తిగా లైఫ్ స్టైల్ మారిపోతుంది. ప్రతిరోజూ  మందులు మింగాల్సిందే. అయితే.. షుగర్ వ్యాధి సోకినవారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా కడుపులో నొప్పి సమస్యతో కూడా బాధపడుతున్నారట.
 

29

రక్తప్రవాహంలోకి వచ్చే చక్కెర (గ్లూకోజ్) మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు ఈ  డయాబెటిక్ సమస్య తలెత్తుతుంది. ఇది గుండె పోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు విఫలమవడం, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీయగలదు.

39

ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని.. నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. దీనివల్ల ప్రమాదాలు ఉన్నా కూడా మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు.

49

మధుమేహం అనేది.. జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

59

చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం.. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు.

69

ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే.

79

రోజూ క్రమం తప్పని విరామాల్లో ఆహారం తీసుకోవటం.. కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం.  తేలికపాటి వ్యాయామాలు  చేసకోవడం కూడా అలవాటు చేసుకోవాలి.

89

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది.

 

99

ఆరోగ్యవంతమైన బరువు కూడా.. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించటానికి సాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే.. నెమ్మదిగా తగ్గటానికి.. వారానికి అర కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గటానికి ప్రయత్నించండి.

click me!

Recommended Stories