మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు
మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు మూత్రంతో సంబంధాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ క్యాన్సర్ వల్ల తరచూ మూత్ర విసర్జన చేయడం, మూత్ర విసర్జన చేయాలనిపిస్తే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్రం ఎరుపు రంగులో కనిపించడం, లేదా ముదురు ఎరుపు, గోధుమ రంగుల్లో మూత్రం రావడం ఉంటాయి.