రాగులు
పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. రాగుల్లో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పాలీఫెనాల్స్ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో ఉండే ఒక రకమైన సూక్ష్మపోషకాలు కూడా రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.