గుండె ఆరోగ్యం
గుమ్మడికాయలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాల్లో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటోస్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తాయి.