ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటే ఇలాగే అవుతుంది

Published : Jun 11, 2023, 03:54 PM IST

చాలా సార్లు మనం అవసరమైన దానికంటే ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ దీనివల్ల శరీరానికి ఎన్నో సమస్యలు వస్తాయి.   

PREV
17
ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటే ఇలాగే అవుతుంది
protein

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా లేదా జిమ్ కు వెళ్లినా.. మీ ఆహారంలో ప్రోటీన్ ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది. ముఖ్యంగా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునే వారికి ప్రోటీన్ ఎక్కువున్న ఆహారాన్ని తినడం చాలా అవసరం. కానీ ప్రోటీన్ ను మోతాదుకు మించి అస్సలు తినకండి. 

శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాల్లో ప్రోటీన్ ఒకటి. మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం కావడం వల్ల శరీరంలో కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. దీనితో పాటుగా ఇది హార్మోన్లను నియంత్రిస్తుంది. అలాగే న్యూరోట్రాన్స్మిటర్లు, రోగనిరోధక పనితీరుకు కూడా చాలా అవసరమవుతుంది.  కానీ ఏదైనా అతిగా తీసుకోవడం ఆరోగ్యం ఎలా అయితే దెబ్బతింటుందో అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..

27

బరువు పెరగొచ్చు

బరువు తగ్గడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని డాక్టర్లు, నిపుణులు సలహానిస్తుంటారు. కానీ ఈ రకమైన ఆహారం స్వల్పకాలికంగా మీ బరువును తగ్గిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇది మీరు బరువు పెరగడానికి కారణమవుతుంది. క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. శరీరంలో కొవ్వు వలె ఎక్కువ ప్రోటీన్ కూడా నిల్వ ఉంటుంది. అలాగే శరీరంలో అమైనో ఆమ్లాల పరిమాణం కూడా పెరుగుతుంది. 
 

37
constipation

మలబద్ధకం సమస్య

మీరు జంతువుల ఆధారిత ప్రోటీన్ తీసుకుంటూ, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆహారాన్ని తీసుకోకపోతే.. మీకు మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడంతో పాటుగా తగినంత నీటిని కూడా తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య రాదు. 

47
bad breath

నోటి దుర్వాసన 

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించినప్పుడు వాసన మరింత ఎక్కువవుతుంది.  బ్రష్ చేయడం, మౌత్ ఫ్రెషనర్లు మొదలైనవి వాసనను తగ్గిస్తాయి. దీనికోసం మీరు రోజుకు కనీసం 2 నుంచి 3 సార్లు బ్రష్ చేయాలి. అలాగే పుదీనా, సోంపు వంటి కొన్ని నేచురల్ మౌత్ ఫ్రెషనర్స్ ను వాడాలి.
 

57

విరేచనాలు 

మీరు ఫైబర్ లేని పాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంటే మీకు విరేచనాల సమస్య వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు లాక్టోస్ అసహనం ఉంటే ప్రోటీన్ కోసం వేయించిన మాంసం, చేపలు మొదలైనవి తినడం మంచిది కాదు. ఇది మీ జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు. విరేచనాల సమస్య రాకూడదంటే.. నీటిని పుష్కలంగా తాగాలి. కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోండి. అలాగే మీ ఆహారంలో ఫైబర్ బాగా పెంచండి. 

67

కాల్షియం నష్టం 

ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ను తీసుకోవడం వల్ల కాల్షియం నష్టం జరుగుతుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. 2013 లో రీసెర్చ్ గేట్ నిర్వహించిన సమీక్ష ప్రకారం.. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వారి ఎముకలు బలహీనంగా ఉంటాయి. 
 

77

రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? 

ఒక వ్యక్తికి ప్రోటీన్ అవసరం వారి వయస్సు, లింగం, శరీర బరువు, శరీర కూర్పు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి శారీరక శ్రమలో పాల్గొనకపోతే.. వారు వారి శరీర బరువులో కిలోగ్రాముకు కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. మీరు రోజులో 1 గంట పాటు వ్యాయామాలు చేస్తే మీ శరీరంలోని 3 కిలోలకు 1.2 నుంచి 1.7 గ్రాముల ప్రోటీన్ ను తీసుకోండి.
 

Read more Photos on
click me!

Recommended Stories