శ్వాసలో సమస్యా? ఈ ఆయుర్వేద చిట్కాలను ఫాలో అవ్వండి తగ్గుతుంది

Published : Jun 11, 2023, 12:26 PM IST

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. శ్వాస సమస్యలకు కారణాలెన్నో ఉన్నాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. 

PREV
15
శ్వాసలో సమస్యా? ఈ ఆయుర్వేద చిట్కాలను ఫాలో అవ్వండి తగ్గుతుంది
Breathing

ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో రోగాల ముప్పును పెంచుతాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి శ్వాస సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. శ్వాస సమస్యలను తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం కలిగిన పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎలాంటి వాటిని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

25
garlic

వెల్లుల్లి, కర్కుమిన్

వెల్లుల్లి, కర్కుమిన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆస్తమాను ప్రేరేపించే శ్లేష్మాన్ని కరిగించడానికి సహాయపడతాయి. ఈ పదార్థాల్లో వేడి స్వభావం ఉండటం వల్ల .. చల్లని స్వభావం కలిగిన శ్లేష్మాన్ని తాకి దీన్ని కరిగిస్తుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వాయుమార్గాలను క్లియర్ చేస్తుంది. చివరికి ఉబ్బసం రోగుల్లో శ్వాస ఇబ్బందులను తగ్గిస్తుంది. ఆస్తమా రోగులు ఈ పదార్థాలను ఆయిల్, క్యాప్సూల్స్, టాబ్లెట్లు అంటూ వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. 
 

35
ginger

అల్లం

అల్లం ఒక శక్తివంతమైన మసాలా దినుసు. ఇది గొంతు నుంచి శ్లేష్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఉబ్బసం రోగులు ఎదుర్కొనే చికాకు లేదా స్క్రాచింగ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలోని భాగాలు వాయుమార్గ మృదువైన కండరాలను సడలిస్తాయి. మంచి ఫలితాల కోసం ఉబ్బసం రోగులు అల్లం పొడిని బెల్లంతో కలిపి తినొచ్చు. దీన్ని టీ కోసం కూడా ఉపయోగించొచ్చు. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. రెండు పదార్థాలు ఎన్నో శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. 

45
tulsi


తులసి

ఆయుర్వేదంలో తులసి ఒక ప్రసిద్ధ మూలిక. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడటమే కాకుండా శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థకు బలాన్ని ఇస్తాయి. తులసిలో జింక్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తులసిని టీతో తీసుకోవడం లేదా తులసి ఆకు రసాన్ని తేనెతో తీసుకోవడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్, ఇన్ఫ్లుఎంజా, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

55

కల్మేగ్

కల్మేగ్ కూడా ఆయుర్వేద పదార్ధం. ఇది ఎన్నో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ వైరల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories