వంకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వంకాయ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. అంతేకాదు ఈ కూరగాయ ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకే వంకాయను ఎన్నో రకాలుగా వండుకుని తింటుంటారు. అయినా వంకాయలు సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో దొరుకుతాయి. నిజానికి వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు తెలుసా? వంకాయ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
వంకాయ మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే గుండె జబ్బులకు కూడా దూరంగా ఉంటారు. ఇంతేకాదు వంకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ.. ఈ వంకాయలకు కొంతమంది దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని వ్యాధులతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ వంకాయ సమస్యలను మరింత పెంచుతుంది. ఎవరెవరు వంకాయను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీల్లో రాళ్లు
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంకాయల్లో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచుతుంది. అందుకే వీళ్లు వంకాయను తినకూడదు.
రక్త లోపం
మగవారితో పోలిస్తే ఆడవారే రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా వంకాయను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంకాయను తింటే శరీరంలో ఇనుము లోపం మరింత పెరుగుతుంది. దీంతో మీ సమస్య మరింత పెరుగుతుంది.
Eggplant
అలెర్జీ సమస్య
మీకు ఎలాంటి అలెర్జీ సమస్య ఉన్నా.. వంకాయలను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే వంకాయల్లో ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కూడా అలెర్జీ సమస్యను మరింత పెంచుతాయి.
vegetables
బలహీనమైన జీర్ణవ్యవస్థ
మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నా, కడుపు సమస్యలతో తరచుగా బాధపడుతున్నా వంకాయను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలు ఉంటే వంకాయను తినకపోవడమే మంచిది.
Eggplant
కంటి సమస్యలు
కంటి సమస్యలున్నవారు కూడా వంకాయను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ కళ్లలో ఏ సమస్య ఉన్నా లేదా మీ కళ్లలో మంటగా అనిపించినా.. వంకాయ కూరను అస్సలు తినకూడదు. ఇది కంటిసమస్యలను పెంచుతుంది. అందుకే దీన్ని పొరపాటున కూడా తినకండి.