ఊబకాయం ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం మరియు ఖర్చు చేసిన కాలేజీల పరిమాణంలో అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది. సూటిగా చెప్పాలంటే మన శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ తిన్నప్పుడు అది అదనపు కొవ్వుగా నిల్వ చేయబడుతుంది.
అలా అధిక కొవ్వు పేరుకుపోవడం వలన గుండెపై ఒత్తిడి మరియు అనేక ఇతర అవాంతరాలు ఏర్పడతాయి. ఊబకాయం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అయితే ఈ బరువుని తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు.
కానీ సులువైన పద్ధతిలో డైట్ పిల్స్ తీసుకొని కొవ్వుని కరిగించాలి అనుకుంటారు. అయితే దానివల్ల లాభనష్టాలు ఏమిటి అనేది చాలామందికి అవగాహన లేదు. డైట్ పిల్స్ తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు ఎక్కువగా కరుగుతుంది.
అయితే కేవలం టాబ్లెట్ తిని ఎక్సర్సైజులు చేయకుండా ఉంటే ఆ టాబ్లెట్ పనిచేయదు. ఇది మంచం మీద నుంచి కదల లేకుండా ఊబకాయంతో బాధపడుతున్న వారికి ఉద్దేశించబడినది. అలాగే ఈ టాబ్లెట్లు వాడటం వలన వాటికి మనం ఎడిక్ట్ అయిపోతాం అనే ఒక అపోహ ఉంది.
కానీ అది నిజం కాదు.అయితే ఈ టాబ్లెట్లు వేసుకోవడం వలన నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివలన మానసిక సమస్యలు, నోరు తడి ఆరిపోవడం, ఇది ఎక్కువగా తీసుకుంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
కాబట్టి టాబ్లెట్ల ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి అతని గైడెన్స్ మీద టాబ్లెట్లు వాడటం అనేది చాలా అవసరం. ఎట్టి పరిస్థితులలోని ఈ టాబ్లెట్ల విషయంలో సొంత పరిజ్ఞానం ఉపయోగించవద్దు.