చేతులు, అరికాళ్లలో చెమట ఎక్కువగా పడుతోందా? ఇలా చేసారంటే ఈ సమస్యే ఉండదు..

First Published | Oct 27, 2023, 2:42 PM IST

కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా అరిచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమట పడుతుంటుంది. కానీ దీనివల్ల ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇలా చెమటలు పడతాయి. ఇలాంటి వారు దీనివల్ల ఇబ్బంది పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బాగా పనిచేస్తున్నప్పుడు చెమట పడుతుంది. ఇది సర్వసాధారణం. అయితే కొంతమందికి పని చేసినా.. చేయకపోయినా అరిచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇలాంటి వారు చెప్పులు వేసుకున్నా కూడా చెమటలు పడతాయి. దీంతో చెప్పులతో నడవడం కష్టంగా ఉంటుంది. ఈ చెమట వల్ల కొన్ని రకాల చెప్పులు జారే అవకాశం ఉంది. అంతేకాదు దీంతో పాదాల్లో మురికి పేరుకుపోతుంది. వాటిలో చెమట వాసన కూడా పెరుగుతుంది. ఇలా చెమటలు పట్టడానికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా కారణమంటున్నారు నిపుణులు. ఈ చెమట వల్ల ఇబ్బంది కలగొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్లీనింగ్

మీ అరికాళ్లు, అరచేతుల్లో తరచుగా చెమటలు పడుతుంటే.. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. ముఖ్యంగా వీటిని క్లీన్ చేయడానికి ఎక్కువగా వాసనొచ్చే సబ్బులను ఉపయోగించకండి. తేలికపాటి సబ్బులను మాత్రమే ఉపయోగించండి. దీనివల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది.


బూట్లు, సాక్స్

అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పట్టేవారికి టైట్ షూస్ పనికిరావు. అందుకే వీళ్లు వదులుగా ఉండే షూస్ ను మాత్రమే వేసుకోవాలి. టైట్ షూస్ వల్ల చెమట ఎక్కువగా పట్టి వాటిలోంచి చెడు వాసన వస్తుంది. చెమట వల్ల పాదాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుది. అలాగే వీళ్లు సాక్స్ ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు నీటిని పీల్చుకునే కాటన్ సాక్స్ ను కొనడం మంచిది. ఎందుకంటే ఇవి చెమటను బాగా గ్రహిస్తాయి.

benefits of wash feet

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా అరిచేతులు, అరికాళ్లలో చెమట ఎక్కువగా పట్టేవారికి బాగా ఉపయోగపడుతుంది. వీళ్లు కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుని నీటిలో మిక్స్ చేయాలి. ఈ నీళ్లలో కాళ్లు, చేతులను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా తరచుగా చేస్తే చెమట నియంత్రణలో ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చెమటను నియంత్రిస్తుంది. దుర్వాసన రాకుండా చేస్తుంది. 
 


బ్లాక్ టీ

బ్లాక్ టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అరికాళ్లకు, చేతులకు విపరీతంగా చెమటలు పెట్టేవారు బ్లాక్ టీని ఉపయోగించి సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బ్లాక్ టీ కషాయంలో చేతులు, కాళ్లను అరగంట పాటు ఉంచాలి. ఇది చేతులు, కాళ్లపై చెమటను తగ్గిస్తుంది. 

Latest Videos

click me!