వర్షాకాలం రాగానే.. సీజనల్ వ్యాధులు.. పిలవకుండానే వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరైనా ఉంటే వెంటనే జబ్బునపడిపోతుంటారు.
ఇదో పిలిచినట్లే.. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరికి జలుబు, జ్వరం, దగ్గు ఇలా అన్నీ ఒక దాని వెంట ఒకటి వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.
అయితే... ఈ సీజనల్ వ్యాధుల నుంచి కేవలం వంటింటిలో లభించే కొన్ని పదార్థాలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు.. వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్తా ఉపశమనం ఉంటుంది.
అదే విధంగా.. అదే వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడూ అదే నీటిలో దాల్చినపొడి కలిపి తీసుకోవచ్చు.
పసుపు పాలు.. వేడి పాలల్లో కాసింత పసుపు కలిపుకుని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీ బయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తుంది.
అల్లం మంచి ఔషధం.. జలుబుతో బాధపడేవారు.. అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు, జలుబు వల్ల వచ్చే దగ్గుని తగ్గిస్తుంది. కాబట్టి.. రెగ్యులర్‌గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీలో అయినా సరే వేసుకోవచ్చు. లేదా. వేడినీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయొచ్చు. దీని వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
ginger
జలుబు ఉన్నవారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏంటంటే.. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకూ తగ్గుతుంది.
మిరియాల పాలు తాగినా జలుబు త్వరగా తగ్గుతుంది. అయితే, మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
Pepper