రోజూ ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ చెంతే..!

First Published Jul 21, 2021, 2:03 PM IST

చాలా మంది సూర్యుడు నడి నెత్తిన వచ్చే వరకు నిద్రలేవరు.  ఆఫీసు వర్క్ కి టైమ్ అయినప్పుడు మాత్రమే నిద్రలేస్తారు. అయితే..  ఆయుర్వేదం ప్రకారం.. సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందే నిద్రలేవాలట. 

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. కరోనా కారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమయ్యారు. నిజం చెప్పాలంటే.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత శరీరానికి అందే కాస్తో కూస్తో వ్యాయామం కూడా తగ్గిపోయింది. దీంతో.. శరీరానికి అందాల్సిన వ్యాయామం తగ్గి.. మెంటల్ స్ట్రెస్ పెరుగుతోంది. దాని వల్ల ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతున్నారు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనే సందేహం మీకు కలగొచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ కింద చెప్పినట్లు చేస్తే.. మీరు ఆరోగ్యంగా ప్రశాంత జీవితాన్ని పొందుతారు. అదెలాగో చూద్దాం..
undefined
చాలా మంది సూర్యుడు నడి నెత్తిన వచ్చే వరకు నిద్రలేవరు. ఆఫీసు వర్క్ కి టైమ్ అయినప్పుడు మాత్రమే నిద్రలేస్తారు. అయితే.. ఆయుర్వేదం ప్రకారం.. సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందే నిద్రలేవాలట. అలా చేసిన తర్వాత చిన్నపాటి వ్యాయామాలు, ప్రాణయామం లాంటివి చేయాలట. అలా చేస్తే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటారట.
undefined
ఇక లేచిన తర్వాత ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కళ్లకు నీళ్లు తగడం వల్ల.. నిద్ర మత్తు వదులుతుంది.
undefined
కచ్చితంగా రాత్రి పడుకునే ముందు టాయ్ లెట్ కి వెళ్లాలట. అలా వెళ్లడం వల్ల నిద్ర మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. నిద్ర కలత ఏర్పడదు.
undefined
లేవగానే బ్రష్ చేయడం ఒక్కటే కాదు.. ఉప్పు నీటితో నోరు పుక్కిలుంచి ఊయాలి. అలా చేయడం వల్ల చిగుళ్లు బలంగా మారతాయి.
undefined
చర్మం మాయిశ్చరైజ్ గా ఉంచడానికి కేవలం క్రీములు వాడితే సరిపోదు. వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు ఆయిల్ తో మసాజ్ చేయాలి.
undefined
ఇక వ్యాయమం చేయాలి అంటే.. జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. జాగింగ్ కి వెళ్లడం.. చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవాలి. అప్పుడు శరీరం ఫిట్ గా ఉంటుంది.
undefined
లేదంటే.. ప్రతిరోజూ యోగా చేయడం మంచి అలవాటు. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఉదయం యోగా చేసి.. సాయంత్రం వ్యాయామం చేయడం ఉత్తమం.
undefined
ఇక ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఆయిల్ పుడ్స్ కి బదులు, మొలకలు, పెరుగు, పండ్లు, జ్యూసులు తీసుకోవడం మంచిది.
undefined
click me!