ఈ అలవాట్లు.. మీ దంతాలను నాశనం చేస్తాయి..!

First Published | Nov 8, 2021, 1:32 PM IST

దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే.. కేవలం ప్రతిరోజూ బ్రష్ చేయడంతో సరిపోదట. చర్మ సంరక్షణ కోసం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో.. అదేవిధంగా.. నోటి ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలట.

మనం తీసుకునే ఆహారం.. నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని.. దంతాలతో నమిలి.. ఆ తర్వాత మింగుతాం. మన శరీరంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అందుకే నోటి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. అయితే.. మనకు తెలీకుండా.. చేసే కొన్ని పొరపాట్లు మన దంతాలను నాశనం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఓసారి చూసేద్దామా..

దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే.. కేవలం ప్రతిరోజూ బ్రష్ చేయడంతో సరిపోదట. చర్మ సంరక్షణ కోసం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో.. అదేవిధంగా.. నోటి ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలట.
 


చాలా మంది తమ దంతాలతో ప్యాకెట్లు చించడం,. సీసాల మూతలు తీయడం లాంటివి చేస్తుంటారు. కానీ అలాంటివి చేయడం వల్ల.. దంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందట. దంతాలు విరిగిపోవడం, బలహీనపడటం లాంటివి జరుగుతుందట. కాబట్టి..  నోటితో అలాంటి పనులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక చాలా మంది గోళ్లను తీయడానికి నెయిల్ కట్టర్ తో కాకుండా.. దంతాలను ఉపయోగిస్తారు. కొందరు ఒత్తిడి కారణంగా.. అలా గోళ్లను కొరుకుతూ ఉంటారు.  ఆ గోళ్లు అపరిశుభ్రంగా ఉండటం వల్ల, గోళ్లు కొరకడం వల్ల దంతాలు దెబ్బ తింటాయి. 

ఇక కొందరు.. కోపంతో.. దంతాలను గట్టిగా కొరుకుతూ ఉంటారు. పళ్లు నూరడం, దంతాలపై ఒత్తిడి పెట్టడం, గ్రైండర్ రుబ్బినట్లు రుబ్బడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల దవడ బలహీనపడుతుంది. దంతాలు  చిట్లడం లాంటివి జరుగుతాయి.

ఇక కొందరు.. మంచు ముక్కలు తినడం, బాగా చల్లగా ఉండే పదార్థాలను లాగించేస్తూ ఉంటారు.  దాని వల్ల కూడా దంతాలు పాడైపోతుంటాయట. కాబట్టి.. ఈ అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రష్ చేసే సమయంలోనూ.. దంతాలు అరిగిపోయేలా రుద్ద కూడదు.  దంతాలను సరిగా శుభ్రం చేయడం అంటే.. అరగదీయడం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. సున్నితంగా..  దంతాలు శుభ్రపరుచుకునేలా క్లీన్ చేసుకోవాలి.  ఆ బ్రష్ చేయడం కూడా సరైన మార్గంలో చేయడం మంచిదని సూచిస్తున్నారు. 

Latest Videos

click me!