తలనొప్పి మిమ్మల్ని తరచూ బాధ పెడుతుందా అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 07, 2021, 05:16 PM IST

పని ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్ ల కారణంగా ప్రస్తుతం అందరిలోనూ కనిపిస్తున్న సమస్య తలనొప్పి. అయితే తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తలనొప్పికి (Headache) కారణాలేవైనా వాటి నివారణకు వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. తలనొప్పి నుంచి ఉపశమనం కలగడానికి సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. వాటి గురించి ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
తలనొప్పి మిమ్మల్ని తరచూ బాధ పెడుతుందా అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

కొన్ని రకాల తలనొప్పులు రోగికి చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. తల నొప్పి నుంచి విముక్తి పొందడానికి టాబ్లెట్స్ (Tablets) వాడుతూ ఉంటాం. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతాయి. మిమ్మల్ని తరచూ తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ ను కలవడం మంచిది. టాబ్లెట్స్ వాడే ముందు ఒకసారి కొన్ని ఇంటి చిట్కాలను (Home remedies) ప్రయత్నించి చూడండి. మీకు మంచి ఫలితం కలుగుతుంది.
 

25

మొదట మీకు ఎన్ని టెన్షన్ లు ఉన్న రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి. దీంతో మీలో ఉన్న చికాకు తగ్గుతుంది. చికాకు తగ్గడంతో మన శరీరంలో ఉన్న అలసట తగ్గి తలనొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. మీకు తల నొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. శరీరం డీహైడ్రేషన్ (Dehydration) బారినపడితే తలనొప్పి వస్తుంది. నీరు తాగడంతో మీ డీహైడ్రేషన్ తగ్గి తల నొప్పి (Headache) నుంచి విముక్తి కలుగుతుంది.
 

35

గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే తలకు రక్త  ప్రసరణ బాగా జరిగి తలనొప్పిని తగ్గిస్తుంది.
మన రోజువారి ఆహారపు శైలిలోని మార్పులతో కూడా తలనొప్పి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు శైలిని అలవరుచుకోవాలి. శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపరిచే ఎక్సర్ సైజులు (Exercises) ఎంచుకోవడం మంచిది. మన శరీరంలో రక్తప్రసరణ (Blood circulation) బాగా ఉంటే తలనొప్పి సమస్యలు రావు.

45

క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే సప్లిమెంట్స్ ను తీసుకున్న కూడా తలనొప్పి నుండి విముక్తి కలుగుతుంది. ఒక గ్లాసు నిండా పాలు (Milk), ఆరెంజ్ జ్యూస్ (Orange juice) తాగడంతో శరీరానికి కావల్సిన క్యాల్షియం, మెగ్నీషియం అందటం వల్ల  తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా, కొత్తిమీర రసాన్ని తలనొప్పి ఉన్నప్పుడు నుదిటి మీద రాసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం రసాన్ని, నిమ్మరసాన్ని సమాన మోతాదులో తీసుకొని సేవించడంతో తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
 

55

ఒక స్పూన్ సొంఠి పొడి, ఒక స్పూన్ వాటర్ లో కలిపి పేస్ట్ లా చేసుకొని ఈ పేస్ట్ ను నుదిటి భాగంలో రాసి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. సొంటి పొడి తల నొప్పి తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగించి వేడి చేసుకున్న ఒక గ్లాసు వాటర్ లో రెండు స్పూన్ ల పసుపు (Turmeric), నాలుగు స్పూన్ ల అల్లం రసం (Ginger juice) కలుపుకుని తాగితే తల నొప్పి తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం తర్వాత తీసుకోవాలి.

click me!

Recommended Stories