అందమైన ఒత్తైన కనుబొమ్మలు కోసం ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 07, 2021, 05:56 PM IST

అందమైన ఒత్తైన కనుబొమ్మలు (Eyebrow) ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అందమైన కనుబొమ్మలతో మన అందం మరింత పెరుగుతుంది. అయితే వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. అప్పుడే అవి అందంగా ఒత్తుగా పెరుగుతాయి. కనుబొమ్మల అందాన్ని పెంచడానికి, ఒత్తుగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం.  

PREV
17
అందమైన ఒత్తైన కనుబొమ్మలు కోసం ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి?

ముఖం అందాన్ని పెంచడానికి కనుబొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అయితే కొందరిలో కనుబొమ్మలు పలుచగా ఉండి వారి అందాన్ని తగ్గిస్తాయి. వారు కనుబొమ్మలు ఒత్తుగా కనపడాలని ఐబ్రో పెన్సిల్ను (Eyebrow pencil) వాడుతూ ఉంటారు. ఇలా కనుబొమ్మలు పలుచగా ఉన్న వారు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలు (Home remedy) అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
 

27

కొబ్బరి నూనె: కనుబొమ్మల పెరుగుదలకు  కొబ్బరినూనెను (Coconut oil) వాడడంతో మంచి ఫలితం ఉంటుంది. కొంచెం కొబ్బరి నూనెను తీసుకొని మీ చేతి వేళ్ళతో కనుబొమ్మలపై రాసి, సున్నితంగా మసాజ్ (Massage) చేయాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
 

37

నిమ్మరసం: నిమ్మరసంలో (Lemon juice) ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి కనుబొమ్మలకు కావలసిన పోషణను (Nutrients) అందించి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి. నిమ్మకాయ రసాన్ని కనుబొమ్మల మీద రబ్ చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

47

కలబంద: కనుబొమ్మలు ఒత్తుగా అందమైన ఆకారంలో రావడానికి కలబంద (Alovera) ఉపయోగపడుతుంది. కనుబొమ్మలకు కలబంద రసాన్ని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో (Water) శుభ్రం చేసుకోవాలి.
 

57

మెంతులు: కనుబొమ్మలు ఒత్తుగా రావాలంటే మెంతులు (Fenugreek) ప్రధాన పాత్ర వహిస్తాయి. నానబెట్టిన మెంతులను మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఈ పేస్ట్ (Paste) ను కనుబొమ్మలపైన రాసి చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
 

67

కోడి గుడ్డులోని పచ్చసొన : కోడి గుడ్డు (Egg) లోని పచ్చని సొనలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఈ పచ్చసొనను కనుబొమ్మల పైన నేరుగా రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని (Hot water) నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇవి కనుబొమ్మలకు కావలసిన ప్రోటీన్ లను అందించి ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
 

77

ఆల్మండ్ ఆయిల్: ఆల్మండ్ ఆయిల్ (Almond oil) కనుబొమ్మలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఏ, బి, ఈ, లు అధికంగా ఉంటాయి. ఆల్మండ్ ఆయిల్ ను కనుబొమ్మల పై వలయాకారంలో రాసి మసాజ్ (Massage) చేయాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!

Recommended Stories