ఈ ఫుడ్స్ వయాగ్రా మాత్ర కంటే ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.. వీటిని తిన్నారంటే సెక్స్ లో ఎలాంటి సమస్యలు రావు..

First Published May 26, 2023, 10:55 AM IST

అంగస్తంభన సమస్య లైంగిక జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. పురుషులు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కాగా దీని కోసం మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
 

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. యువకులలో అంగస్తంభన సమస్య పెరుగుతోంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారు. అంగస్తంభన సమస్యకు ప్రధాన కారణం చెడు జీవనశైలి, చెడు ఆహారం. అంగస్తంభన సమస్య లైంగిక జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పురుషుల ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. 

అయితే అంగస్తంభన సమస్య కోసం మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అందుకే మీరు, మీ భాగస్వామి ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి సహజంగా సెక్స్ ఆహారాలు. అలాగే అంగస్తంభనలను పెంచడానికి సహాయపడతాయి. అలాంటి నేచురల్ వయాగ్రా ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

బచ్చలికూర

పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. బచ్చలికూరలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీనితో పాటు ఫోలిక్ యాసిడ్ పురుష లైంగిక పనితీరును ప్రోత్సహిస్తుంది. 1 కప్పు వండిన బచ్చలికూర మన శరీరానికి ఫోలేట్ సాధారణ అవసరాలలో 77 శాతం అందిస్తుంది. దీనితో పాటుగా తగినంత మొత్తంలో మెగ్నీషియం కూడా ఉంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడానికి, శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

Avocados

అవొకాడో

పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. అవొకాడో పురుషుల స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. పురుషులలో వంధ్యత్వ సమస్యను పరిష్కరించడానికి ప్రభావవంతంగా ఉంటుంది. దీనితో పాటుగా అవొకాడోలో జింక్ ఉంటుంది.  ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. సంతానోత్పత్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. 
 

ఆపిల్

ప్రోస్టేట్ ఆరోగ్యానికి ఆపిల్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ తొక్కల్లో ముఖ్యంగా ఉర్సోలిక్ ఆమ్లం అని పిలువబడే క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉర్సోలిక్ ఆమ్లం ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది.
 

pumpkin seeds

గుమ్మడికాయ విత్తనాలు

పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. గుమ్మడికాయ విత్తనాలలో తగినంత మొత్తంలో జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది మీ సెక్స్ హార్మోన్  స్థాయిలను ఉత్తేజపరుస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలు లేకుండా మీ భాగస్వామి లైంగిక శక్తిని పెంచుతుంది.

watermelon

పుచ్చకాయ

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. వయాగ్రా మాదిరిగానే సంపూర్ణంగా పనిచేసే పోషకమైన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ముఖ్యంగా పుచ్చకాయ గింజలు మీ భాగస్వామికి సెక్స్ శక్తిని పెంచుతాయి. పుచ్చకాయలోని సిట్రులేస్ మీ రక్త నాళాలను సడలిస్తుంది. అర్జినిన్ ను ఉత్పత్తి చేసేటప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ మీ లైంగిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది మీ భాగస్వామికి సెక్స్ కోరికలను పెంచుతుంది. 
 

అరటిపండ్లు

అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. ఈ పండులో ఉన్న విటమిన్ బి మీ శక్తిని పెంచుతుంది. అలాగే మీ భాగస్వామి సెక్స్ లో ఎక్కువ సేపే పాల్గొనేలా  చేస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది.
 

Image: Getty Images

దానిమ్మ

దానిమ్మను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. అలాగే మీ లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మ జ్యూస్ వయాగ్రాలా పనిచేసి సహజంగా సెక్స్ కోరికను పెంచుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ సన్నిహిత ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. 
 

undefined

డార్క్ చాక్లెట్

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. అంగస్తంభన లోపానికి ఒత్తిడి అతిపెద్ద కారణాలలో ఒకటి. డార్క్ చాక్లెట్ లో సెరోటోనిన్, ఫినెథైలామైన్ ఉన్నాయి. ఇవి మీ లిబిడోను పెంచుతాయి.

click me!