పురుషుల్లో సంతానలేమి.. ఏం చేయాలంటే?

First Published Dec 15, 2023, 7:15 AM IST

ఆడవారికే కాదు పురుషులకు కూడా సంతానలేమి సమస్య ఉంటుంది. అయితే పురుషుల్లోని ఈ సమస్యను కొన్ని లక్షణాల ద్వారా చాలా ఈజీగా గుర్తించొచ్చు.  ఆ తర్వాత.. 
 

infertility

సంతానలేమి పురుషులు, మహిళలను ఇద్దరినీ ఒకేలా ప్రభావితం చేస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. హార్మోన్ల సమస్యలు, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దీనికి కొన్ని ఉదాహరణలు. కానీ స్త్రీపురుషుల మధ్య జీవసంబంధమైన వ్యత్యాసాలు వీళ్లను ప్రభావితం చేసే వ్యాధులలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సంతానలేమి వంటి వ్యాధుల్లో.

పురుషులకు సంతానలేమి సమస్య వచ్చిన తర్వాత దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పునరుత్పత్తి అవకాశాలు తొలగిపోతాయి. అయితే సంతానలేమి సమస్య ఉందో? లేదో? ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియదు. ఇదే సమస్యను మరింత పెద్దది చేస్తుంది. అయితే సంతానలేమి సమస్య ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 

men infertility

సంతానలేమి సమస్య ఉన్నవారిలో అంగస్తంభన లోపం ఉంటుంది. ఇది ప్రధాన లక్షణం కూడా. అంగస్తంభన లోపం, అంగస్తంభన సమయం తగ్గడం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటున్నట్టైతే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. వృషణాలలో కనిపించే మార్పులు, అసౌకర్యం, నొప్పి వంటి లక్షణాలను కూడా దాచకూడదు. ఎందుకంటే ఇవి వంధ్యత్వంతో సంబంధం కలిగి ఉండొచ్చంటున్నారు నిపుణులు.

అలాగే వీర్యకణాల పరిమాణం, నాణ్యత, స్వభావం, వీర్యంలోని రక్త పరిమాణంలో వ్యత్యాసం కనిపిస్తే తప్పనిసరిగా హాస్పటల్ కు వెళ్లాలి. హార్మోన్ల సమస్యలున్న పురుషుల ముఖం, ఇతర శరీర భాగాలపై జుట్టు పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఇది కూడా సంతానలేమికి ఒక సంకేతం. కానీ ముఖం లేదా శరీర భాగాలపై తక్కువ జుట్టు పెరుగుదల ఉన్న పురుషులందరికీ వంధ్యత్వం ఉండదు. 
 

సంతానలేమికి కారణాలు

వంధ్యత్వం ప్రధానంగా మహిళలకు వచ్చిన మాదిరిగానే హార్మోన్ల సమస్యల వల్ల వస్తుంది. వీటితో పాటుగా పునరుత్పత్తి వ్యవస్థలోని అవయవాల సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు, స్మోకింగ్, ఆల్కహాల్, లేదా ఇతర పదార్ధాల వాడకం వంటి పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, మధుమేహం, హై బీపీ, లైంగిక సంక్రమణ వ్యాధులు వంటి వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. 
 

సంతానలేమి సమస్య నుంచి ఎలా బయటపడాలంటే.. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. అలాగే మీ భాగస్వామితో సంతోషకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే వంధ్యత్వ సమస్యను కొంతవరకు నివారించొచ్చు. 
 

click me!