మీకు నోటి నుంచి దుర్వాసన వస్తదా? అయితే ఈ వ్యాధులున్నాయేమో చెక్ చేసుకోండి..

R Shivallela | Updated : Sep 24 2023, 07:15 AM IST
Google News Follow Us

నోటి దుర్వాసన కేవలం నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోతేనే కాదు ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కూడా వస్తుంది. అందుకే ఈ వ్యాధులు మీకు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
 

19
మీకు నోటి నుంచి దుర్వాసన వస్తదా? అయితే ఈ వ్యాధులున్నాయేమో చెక్ చేసుకోండి..

నోటి దుర్వాసన వల్ల నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్య ఉన్న వారు ఇతరుల ముందు మనస్ఫూర్తిగా నవ్వలేరు కూడా. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నిజానికి నోటి దుర్వాసనకు ఎన్నో కారణాలున్నాయి. నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే కూడా నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత లేకుంటే ఖచ్చితంగా నోటి దుర్వాసనతో సహా ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇదొక్కటే దీనికి కారణం కాదు.
 

29

చిగుళ్ల వ్యాధి, ఉదర సంబంధ వ్యాధులు, తినే రుగ్మతలు వంటి ఎన్నో కారణాల వల్ల నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. అయితే సరిగ్గా బ్రష్ చేస్తే, సరైన మౌత్ వాష్ లను ఉపయోగించడం వల్ల నోటి దుర్వాస తగ్గుతుంది. అయితే కొంతమందికి నోటిని సరిగ్గా క్లీన్ చేసినా, బ్రష్ చేసినా.. మౌత్ వాష్ లను వాడినా కూడా నోట్లో నుంచి చెడు వాసన వస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

39
bad breath

మౌత్ వాష్ 

కొన్ని రకాల మౌత్ వాష్ లల్లో ఆల్కహాల్ ఉంటుంది. ఇలాంటివి ఉపయోగించడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి మౌత్ వాష్ లకు దూరంగా ఉండాలి. 
 

Related Articles

49

నోరు పొడిబారడం

కొంతమందికి ఎప్పుడూ నోరు పొడిబారుతూనే ఉంటుంది. ఇదొక సమస్య. దీనివల్ల కూడా నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది. వీళ్లు ఏం చేసినా దుర్వాసన వస్తూనే ఉంటుంది. నోరు పొడిబారడం అంటే నోట్లో తగినంత లాలాజలం ఉత్పత్తి కాదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నోటి ద్వారా శ్వాస పీల్చుకునే అలవాటు, కొన్ని రకాల మందులు, డీహైడ్రేషన్ వంటివి నోరు పొడిబారడానికి కారణమవుతాయి. 
 

59
bad breath

నోట్లోని బ్యాక్టీరియా

నాలుక మీద ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే ఈ బ్యాక్టీరియా కొంతమందిలో నోట్లో నుంచి చెడు వాసన రావడానికి కారణమవుతుంది. అందుకే క్రమం తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. 

69
bad breath

కొన్ని ఆహారాలు

కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు కూడా నోట్లో నుంచి చెడు వాసన రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొన్ని రకాల మసాలా దినుసుల వల్ల నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది. అలాగే ఆమ్ల పానీయాలు, కాఫీ, ఆల్కహాల్ కూడా నోట్లో నుంచి చెడు వాసన వచ్చేలా చేస్తాయి. 
 

79
bad breath

స్మోకింగ్

స్మోకింగ్ ఒక వ్యసనం. దీన్ని కాల్చకుండా ఉండలేకపోతారు ఈ అలవాటు ఉన్నవారు. ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు స్మోకింగ్ వల్ల కూడా నోట్లో నుంచి దుర్వాసన కూడా వస్తుంది. 
 

89

కొన్ని మందులు

కొన్ని రోగాలు, కొన్ని రకాల మందులు, చికిత్సలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అయితే ఈ వ్యాధులు తగ్గిన వెంటనే నోట్లో నుంచి చెడు వాసన రావడం తగ్గుతుంది. కానీ కొన్ని వ్యాధులు ఆ విధంగా నయం కావు. అలాంటప్పుడు నోటి దుర్వాసనను కూడా నియంత్రించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక సైనసైటిస్, జీర్ణ సమస్యలు, టాన్సిల్స్లిటిస్, శ్వాసకోశ సమస్యలు, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, డయాబెటిస్ ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. 
 

99

ఒత్తిడి

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఇదొక మానసిక సమస్య. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శారీరక ఆరోగ్యాన్నికూడా దెబ్బతీస్తుంది. మీకు తెలుసా? తరచుగా ఒత్తిడికి గురయ్యే వారి నోట్లో నుంచి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒత్తిడి 'నోరు పొడిబారడం', జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

Read more Photos on
Recommended Photos