సోరియాసిస్ ఒక దీర్ఘకాలిక చర్మ సమస్య. ఈ వ్యాధి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఎరుపు, పొలుసుల మచ్చలు కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలిక సమస్య. అంటే ఇది సంవత్సరాల కాలం లేదా జీవితాంతం ఉంటుంది. అయితే ఈ సోరియాసిస్ సమస్యకు ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ ఇది అతి చురుకైన రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినదని నమ్ముతారు. జెనెటిక్స్ కూడా ఇందుకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే సంక్రమణ, ఒత్తిడి వంటి కొన్ని పర్యావరణ కారకాల వల్ల కూడా ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. అయితే ఈ సోరియాసిస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. చర్మం ఎర్రగా మారడం, పొలుసులు ఏర్పడుతాయి. కానీ ఇవి బాగా దురద పెడతాయి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. దీనికి మందులు, యూవీ లైట్ థెరపీ, నోటి లేదా ఇంజెక్షన్ మందులను ఉపయోగిస్తారు. అయితే ఈ సోరియాసిస్ అంటువ్యాధి కాదు. కానీ దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కానీ సరైన చికిత్స, జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించొచ్చు.