
తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనివల్ల తల పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ నొప్పి గంటల పాటు ఉంటుంది. అందుకే తలనొప్పిని వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ముందుగా గుర్తొచ్చేది తైలం.
తలనొప్పి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. డీహైడ్రేషన్, మానసిక ఒత్తిడి, సరిగ్గా తినకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. కారణాలేవైనా తలనొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది తైలాన్నే ఉపయోగిస్తుంటారు.
చాలా మంది బామ్ ను ప్రతిరోజూ ఉపయోగిస్తుంటారు. తలనొప్పికి మాత్రమే కాకుండా శరీరానికి కూడా కొంతమంది తైలాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ తైలంతో తలనొప్పిని తగ్గించుకోవడం మంచిదేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?
తైలం ఉపయోగాలు:
భరించలేని తలనొప్పి కలిగినప్పుడు తైలం వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది. భారతదేశంలో లభించే తైలాలు నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. తలనొప్పిని మాత్రమే కాకుండా కండరాల నొప్పులను కూడా ఇవి నయం చేస్తాయి.
తలనొప్పి తగ్గడానికి తైలాన్ని ఉపయోగిస్తే బాగా మసాజ్ చేయాలి. ఇది కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.దీనివల్ల ఒత్తిడి తగ్గి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
సాధారణంగా తలనొప్పి తైలాలు సువాసనతో తయారుచేస్తారు. ఈ సువాసన మనసును ప్రశాంతంగా చేస్తుంది.మానసిక ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మందికి నిద్ర లేమి వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. రాత్రిపూట తైలాన్ని అప్లై చేసి నిద్రపోతే బాగా నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యకు తలనొప్పి తైలం ఒక చక్కటి పరిష్కారం.
తైలం దుష్ప్రభావాలు:
తైలం తలనొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుంది. కానీ దీన్ని ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఈ తైలాల తయారీలో ఉపయోగించే కొన్ని పదార్థాలు అలెర్జీని కలిగిస్తాయి. దీనిని చర్మానికి అప్లై చేయడం వల్ల వాపు, దురద, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. కొంతమందిలో చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి.
మీరు తలకు తైలాన్ని అప్లై చేసినప్పుడు మీకు తెలియకుండానే కళ్లలో పడితే కళ్లు బాగా మండుతాయి. కొన్నిసార్లు తలకు తైలం రాసుకునేటప్పుడు జుట్టుకు తగులుతుంది. దీనివల్ల జుట్టు ఊడిపోతుంది. తలనొప్పి తైలంను ఉపయోగించడం వల్ల కొన్ని నిమిషాల పాటు తలనొప్పి తగ్గిపోతుంది. కానీ నిజంగా తలనొప్పి ఎందుకు వచ్చిందో దానిని సరిదిద్దకుండా తలనొప్పిని పూర్తిగా నయం చేయలేం.
మీరు ఎప్పుడూ తైలాన్ని ఉపయోగిస్తే చర్మ సమస్యగా మారుతుంది. ముఖంలోని చర్మం శరీరంలోని ఇతర భాగాల చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి మీరు తరచుగా తైలాన్ని రాసుకుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.
తైలమనేది ఎన్నో రకాల మూలికలతో తయారు చేయబడుతుంది. ఇది తలనొప్పిని స్వల్పకాలికంగా తగ్గిస్తుంది. దీనిలో ఉండే కర్పూరం, మెంథాల్, యూకలిప్టస్ వంటివి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ దీనిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం మంచిది కాదు. మీకుత తరచుగా తలనొప్పి వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.