వీళ్లు అల్లం తినకూడదు.. ఎందుకంటే?

First Published | Sep 11, 2024, 2:05 PM IST

మన రోజువారి ఆహారంలో అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది వీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తరిగి వేస్తే.. మరికొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేస్తారు. ఇది కూరలను టేస్టీగా చేస్తుంది. అయితే కొంతమంది అల్లాన్ని అస్సలు తినకూడదు. తింటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

అల్లాన్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా మన రోజువారి కూరల్లో అల్లం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇదే కూరలను మరింత టేస్టీగా చేస్తుంది. చాలా మంది అల్లాన్ని టీలో కూడా వేస్తారు. అల్లం టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

అల్లంలో ఉండే ఎన్నో ఔషదగుణాలు మనల్ని దగ్గు, జలుబు, కఫం, వాతం వంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కానీ అల్లం కొంతమందికి మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తుంది.

ముఖ్యంగా దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే. అసలు అల్లాన్ని ఎవరు ఎక్కువగా తినకూడదు? దీన్ని ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వికారం, వాంతులు

సాధారణంగా చాలా మంది అల్లాన్ని వికారం, వాంతులు తగ్గడానికి ఉపయోగిస్తారు. నిజానికి ఇది ఈ సమస్యలను తగ్గించడానికి అల్లం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని చాలా మంది ఉపయోగిస్తుంటారు.

కానీ కొంతమందిలో ఇది వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది. అంటే అల్లాన్ని ఎక్కువగా తింటే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. 
 


నోట్లో మంట

అల్లంలో కూడా క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం మిరపకాయల్లో ఉంటుంది. అంటే మీరు దీన్ని మోతాదుకు మించి తింటే మీ నోట్లో చిరాకు కలుగుతుంది. నోట్లో విపరీతమైన మంట కలుగుతుంది. 
 

డయేరియా 

మీరు తినే ఆహారంలో లేదా తాగే పానీయాల్లో అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే  మీకు విరేచనాల సమస్య రావొచ్చని  నిపుణులు చెబుతున్నారు. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారు దీన్ని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

చర్మపు చికాకు

చాలా మంది అల్లం నూనెను కూడా ఉపయోగిస్తుంటారు. అంటే నొప్పులను తగ్గించుకోవడానికి దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేస్తుంటారు. కానీ అల్లం నూనెలో కొన్ని రసాయనాలు ఉంటాయి, ఇవి కొంతమంది చర్మాన్ని చికాకుపెడతాయి. అల్లం నూనెను డైరెక్ట్ గా స్కిన్ కు రాయడం వల్ల చర్మము చికాకు, దురద, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. 

మందులతో దుష్ప్రభావాలు

అల్లాన్ని కొన్ని మందులతో అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల మన జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మీరు రెగ్యులర్ గా ఏవైనా మందులు తీసుకుంటుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే అల్లాన్ని తీసుకోండి. 

రక్తాన్ని పలుచన చేస్తుంది

అల్లంలో ఉండే కొన్ని సమ్మేళనాలు మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. అయితే మీరు రక్తం సన్నబడటానికి మందులను తీసుకుంటున్నట్టైతే ..డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే అల్లాన్ని తీసుకోండి. 

అల్లం దుష్ప్రభావాలను నివారించే మార్గాలు

అల్లం వల్ల ఎలాంటి సమస్యలు రావొద్దంటే మీరు దీన్ని లిమిట్ లోనే తినాలి. అయితే అల్ల నూనెను డైరెక్ట్ గా స్కిన్ కు రాయకుండా ఉండండి. దీన్ని ఉపయోగించాల్సి వస్తే.. అల్లం నూనెను కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో కలిపి వాడండి. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు అల్లాన్ని అతిగా తినాల్సి వస్తే డాక్టర్ ను ముందుగా సంప్రదించండి. 

మీరు రెగ్యులర్ గా ఏవైనా మందులు తీసుకుంటున్నట్టైతే మీరు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.అలాగే తక్కువ మొత్తంలో అల్లాన్ని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి చిన్నా పెద్దా సమస్యలు తగ్గిపోతాయి. 

Latest Videos

click me!