ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తలనొప్పి అనే మహా రోగంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ తలనొప్పిలోనూ చాలా రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని తలనొప్పులను మైగ్రేన్ కిందకు పరిగణించలేమట. కొందరికి పని ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు, టెన్షన్, టీవీ, ఫోన్లు చూడటం లాంటి కారణాల వల్ల కూడా ఈ తలనొప్పి వస్తుందట. మరి.. ఈ తలనొప్పి నుంచి ఉపశమనం లభించేదెలా అంటే.. ఇదిగో నిపుణుల సలహాలు ఫాలో కావాల్సిందే.

తలనొప్పిని రెండు రకాలు వర్గీకరించవచ్చట. అందులో ఒకటి ప్రాథమికం కాగా.. రెండోది ద్వితీయ. ఈ ప్రాథమిక తలనొప్పి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా వస్తుంది. ఒత్తిడి, అలసట, గర్భం దాల్చినప్పుడు, నిద్ర సరిగా పోని సమక్షంలో , లేదా భోజనం చేయకపోవడం వదల్ల, మద్యం ఎక్కువగా సేవించడం వస్తుంది.

ఇవి కాకుండా.. తలనొప్పి వస్తోంది అంటే.. అది ద్వితీయ కిందకు వస్తుందని చెప్పాలి. ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మెదడు నరాలు ఉబ్బడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట.

ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి కూడా ప్రాథమిక తలనొప్పి కిందకే వస్తుందట. ఈ రకం తలనొప్పితో బాధపడుతున్నవారు.. నుదురుని ఎప్పుడూ బిగుతూ ఒత్తి పట్టి ఉంచుతారు. వారి తలను ఎవరైనా గట్టిగా నొక్కినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా.. మెడ కూడా నొప్పి వస్తూ ఉంటుంది.

ఈ టెన్షన్, ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి.. 30 నిమిషాల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుందట. నెలలోపు తగ్గిపోతుందట. దీని లక్షణాలు నెల రోజుల వరకు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకుంటే.. క్రమేపీ దీర్ఘకాల తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.

టెన్షన్ కారణంగా తలనొప్పి రావడానికి దారితీసే కారణాలు ఇవే..
కంప్యూటర్ స్క్రీన్ వైపు చూడటం
ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే అలసట
మద్యం సేవించడం
జలుబు చేయడం,
సరైన నిద్ర లేకపోవడం
మంచినీరు ఎక్కువగా తీసుకోకపోవడం..
ఆకలితో ఉండటం లేదా భోజనం దాటవేయడం
ఐరన్ విటమిన్ లోపం
దవడ సమస్యలు
ధూమపానం
మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి లేదా నిరాశ వంటి మానసిక అనారోగ్యాలు.

టెన్షన్ కారణంగా తలనొప్పితో బాధపడుతున్నామని గుర్తించే లక్షణాలు..
నుదిటిలో లేదా చుట్టూ లేదా తల వెనుక వైపు నొప్పి
మెడ,భుజాలలో నొప్పి
కళ్ళ నొప్పి
నిద్రలో ఇబ్బంది
ఎక్కువ చిరాకు పడటం.
ఈ తలనొప్పి ఎక్కువగా పగటి పూట మాత్రమే వస్తుంది.

ఈ నొప్పితో మీరు కూడా బాధపడుతున్నట్లయితే.. వెంటనే వైద్యులను కలవడం ఉత్తమమైన మార్గం. వైద్యుల సలహా మేరకు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.