ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యవంతమైన గుండె చాలా ముఖ్యం. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఏం తింటున్నాం? ఏం తాగుతున్నామనేది? మన గుండె ఆరోగ్యాన్ని నిర్థారిస్తుంది. అందుకే అలాంటి అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే హృదయాన్ని పదిలం చేసుకోవచ్చు. అందుకే మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు బదులు, ఆరోగ్యకరమైన ఆహారం గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచుతుంది.
రెడ్ మీట్.. గుండెకు అంత మంచిది కాదు. ఆరోగ్యకరమైన హృదయం కోసం తెల్లమాంసం తినాలి. బీఫ్, గొర్రె, పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం బారిన పడతారు.
సోడా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. గుండె నుండి శరీరంలోని మిగతా భాగాలకు శుద్ధమైన రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు దెబ్బతింటాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెరుగుతుంది.
కేకులు, కుకీస్ లో పిండి, చక్కెర, కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచిది కాదు. గోధుమలు, చక్కెర లేని ఆహారాలు, లిక్విడ్ ప్లాంట్ ఆయిల్ లేదా వెన్న లాంటివి ఆహారంలో చేర్చాలి.
మాంసాహారంలో హాట్ డాగ్స్, సాసేజ్, సలామి మొదలైనవి చాలా అనారోగ్యకరమైన ఆహారాలు, ఇవి గుండె జబ్బులు పెరగడానికి కారణమవుతాయి.
వైట్ రైస్, బ్రెడ్, పాస్తా, మైదా తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలలో ఆరోగ్యకరమైన ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. అయితే ప్రాసెస్ చేసిన ఆహారం శరీరంలో చక్కెరలను వేగంగా పెంచడం వల్ల కొవ్వు ఎక్కువయ్యేలా చేస్తుంది.
ప్రాసెస్డ్ ఫుడ్టైప్ 2 డయాబెటిస్, అబ్ డామినల్ ఫ్యాట్ పెరుగుదలకు దారితీస్తుంది. అన్నం తినాలనుకుంటే.. అన్నంతో పాటు మీరు ఫైబర్ ఎక్కువుండే ఆహారం తీసుకునేలా చూసుకోండి.
ఇక పిజ్జా గుండెకు అస్సలు మంచిది కాదు. ఇందులో సోడియం, కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా పిజ్జా తినాలనుకుంటే, తక్కువ జున్ను, సాసేజ్, తక్కువ ఉప్పుతో హోల్ వీట్ తో తయారైనవి ఎంచుకోండి.
ఇక పిజ్జా గుండెకు అస్సలు మంచిది కాదు. ఇందులో సోడియం, కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా పిజ్జా తినాలనుకుంటే, తక్కువ జున్ను, సాసేజ్, తక్కువ ఉప్పుతో హోల్ వీట్ తో తయారైనవి ఎంచుకోండి.
వీటితో పాటు ఆల్కహాల్, వెన్న, ఫుల్ ఫ్యాట్ పెరుగు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, క్యాన్డ్ సూప్, ఐస్ క్రీం, చిప్స్ మొదలైన వాటికి దూరంగా ఉండండి. ఇవి గుండెను అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి.