దానిమ్మలో విటమిన్ బి, సి, కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు (vitamins) వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. దానిమ్మ శరీర ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.