పచ్చికొబ్బరిని మనం నిత్యం వంటలలో, స్వీట్ ల తయారీలో వాడుతుంటాం. పచ్చికొబ్బరిని నేరుగా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. పచ్చి కొబ్బరి పలు రకాల వ్యాధులను నయం చేయగల శక్తి కలిగి ఉంటుంది. పచ్చి కొబ్బరిలో అధిక మొత్తంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial), యాంటీ ఫంగల్ (Antifungal) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రిములు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, వైరస్ ల కారణంగా ఏర్పడే వ్యాధులను నయం చేయడానికి చక్కగా పనిచేస్తాయి. పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.