దాల్చిన చెక్క నీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

First Published Dec 19, 2021, 1:14 PM IST

అందరి వంటింట్లో మసాలాదినుసులలో అందుబాటులో ఉండే దాల్చినచెక్క (Cinnamon) అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కను అనేక రకాల వంటలలో వాడుతుంటారు. ఇది వంటలకు మంచి వాసనను అందించడంతో పాటు రుచిని కూడా కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే అనేక పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా దాల్చిన చెక్క నీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..
 

దాల్చిన చెక్కలో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి  పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం, జింక్, ఐరన్ లను దాల్చిన చెక్క కలిగి ఉంటుంది.  ఈ న్యూట్రియెంట్స్ (Nutrients) అనేవి బ్లడ్ ప్రెషర్ (Blood pressure), బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించేందుకు సహాయపడతాయి. రోజు రెండుసార్లు దాల్చినచెక్క నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే దాల్చిన చెక్క నీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
 

నెలసరి నొప్పులను తగ్గిస్తుంది: నెలసరి సమయంలో మహిళలలో వచ్చే విపరీతమైన నొప్పులను తగ్గించడానికి దాల్చినచెక్క నీరు సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో అనాల్జేసిక్ (Analgesic), యాంటీ-కోగ్యులేట్ (Anti-coagulant) ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి.
 

అధిక బరువును తగ్గిస్తుంది: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు దాల్చినచెక్క నీటిలో (Cinnamon) తేనెను (Honey) కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నీరు శరీరంలోని టాక్సిన్లను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ నీరు ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావనను కలుగచేస్తుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది.
 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దాల్చిన చెక్క నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ నీరు శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తాయి. అలాగే ఈ నీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి.

క్యాన్సర్ ను నివారిస్తుంది: దాల్చిన చెక్క నీటిలో యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్స్ (Anticarcinogenic compounds) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికడతాయి. ఈ నీరు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క నీటిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్యాన్సర్ (Cancer) ను నివారించే ఔషధంగా దాల్చిన చెక్క నీరు సహాయపడుతుంది.

అలాగే పైన చెప్పిన సమస్యలతోపాటు PCOS ప్రభావాన్ని తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, పంటి నొప్పి (Toothache), చిగుళ్ళ వాపును తగ్గించడానికి, డయాబెటిస్ (Diabetes) ను అరికట్టడానికి, వినికిడి శక్తిని పెంచడానికి, గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడానికి ఈ దాల్చిన చెక్క నీరును రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

click me!