సెనగలతో పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసా.. ఎంత రుచిగా ఉంటుందో!

Navya G   | Asianet News
Published : Dec 08, 2021, 02:00 PM IST

పులావ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. పులావ్ వేడి వేడిగా పొగలు కక్కుతున్నప్పుడు పెరుగు పచ్చడితో తింటే భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే పులావ్ లకు బదులుగా వెరైటీగా పులావ్ లను ట్రై చేయండి. ఇలాంటప్పుడు సెనగలతో పులావ్ తయారు చేసుకోండి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా సెనగల పులావ్ (Senagala Pulao) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..   

PREV
17
సెనగలతో పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసా.. ఎంత రుచిగా ఉంటుందో!

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం (Basmati rice) ఒక కప్పు, పెద్ద సెనగలు (Senagalu) ఒక కప్పు, అర చెంచా జీలకర్ర (Cumin seeds), బిర్యానీ ఆకులు (Bay leaves) రెండు, దాల్చిన చెక్క (Cinnamon) ఒక ముక్క, యాలకులు (Cardamom) నాలుగు, లవంగాలు (Cloves) నాలుగు, మిరియాలు (Block pepper) పది. 
 

27

పచ్చిమిర్చి (Chilies) రెండు, ఉల్లిపాయ (Onion) ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్  (Ginger garlic paste) ఒక చెంచా, పెరుగు (Curd) అర కప్పు, ధనియాల పొడి (Coriyander powder) ఒక చెంచా, పసుపు (Turmeric) చిటికెడు, ఉప్పు (Salt) తగినంత, కొత్తిమీర (Coriyander) తరుగు, పుదీనా (Mint) తరుగు, నెయ్యి (Ghee) పావు కప్పు, ఒక చెంచా నిమ్మరసం (Lemon juice).
 

37

తయారీ విధానం: ముందుగా నాలుగు గంటల పాటు నానపెట్టుకున్న సెనగలను (Senagalu)  కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి. అలాగే బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పోపుకు సరిపడా నెయ్యి (Ghee) వేసి వేడిచేసుకోవాలి.
 

47

నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర  (Cumin), యాలకులు, లవంగాలు (Cloves), దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి  వేయించుకోవాలి.
 

57

ఇవన్నీ బాగా వేగిన తరువాత ఇందులో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు వేసి కలుపుకోవాలి. మసాలా (Masala) అంతా బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో ముందుగా కడిగి అరగంట పాటు నాపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని, ఉడికించిన సెనగలను, రుచికి సరిపడా ఉప్పు (Salt) వేసి కలుపుకోవాలి.
 

67

ఇందులో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు (Water) పోసి ఒక చెంచా నిమ్మరసం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సెనగల పులావ్ రెడీ. ఈ పులావ్ ను పెరుగు పచ్చడితో (Perugu pachadi) సర్వ్ చేయండి.
 

77

ఈ పులావ్ (Pulav) చాలా రుచిగా (Delicious) ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పులావ్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పులావ్ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.

click me!

Recommended Stories