గోధుమ రవ్వతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. ఎంత బాగుంటుందో!

First Published Dec 8, 2021, 12:06 PM IST

మనం నిత్యం ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి ట్రై చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేసే ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ లను తిని పిల్లలకి బోర్ కొడుతుంది. వారు కొత్తగా వెరైటీగా ట్రై చేసే బ్రేక్ ఫాస్ట్ లను తినడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు మీరు గోధుమ రవ్వ కిచిడిని (Wheat ravva kichidi) ట్రై చేయండి. ఈ బ్రేక్ ఫాస్ట్ మీ పిల్లలకు చాలా నచ్చుతుంది. గోధుమ రవ్వతో చేసుకునే కిచిడీ హెల్త్ కు చాలా మంచిది. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ (Healthy Breakfast). ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా గోధుమ రవ్వ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. 
 

కావలసిన పదార్థాలు: సగం కప్పు గోధుమ రవ్వ (Wheat ravva), సగం కప్పు పెసరపప్పు (Pesarappu), పావు కప్పు పచ్చి బఠాణీలు (Green peas), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు టమాటాలు (Tomato), కొంచెం తరిగిన అల్లం (Ginger), ఒక క్యారెట్ (Carrot), చిటికెడు పసుపు (Turmeric).
 

తగినంత కారం (Red chilli powder), రుచికి సరిపడినంత ఉప్పు (Salt), అర చెంచా జీలకర్ర (Cumin seeds), సగం చెంచా ఆవాలు (Mustard), రెండు టేబుల్ స్పూన్ లు ఆయిల్ (Oil), రెండు టేబుల్ స్పూన్ లు నెయ్యి (Ghee), తరిగిన కొత్తిమీర (Coriyander), బంగాళదుంప (Potato) ఒకటి, రెండు టేబుల్ స్పూన్ ల బీన్స్ (Beans) ముక్కలు.
 

తయారీ విధానం: ముందుగా గోధుమ రవ్వను, పెసరపప్పు విడివిడిగా అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరవాత అందులో ఆవాలు (Mustard), జీలకర్ర (Cumin) వేసి వేయించుకోవాలి.
 

ఇవి వేగిన తరువాత అల్లం ముక్కలు, పచ్చిబఠాణీలు, క్యారెట్ ముక్కలు, టమోటో ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బంగాళాదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు (Salt), పసుపు (Turmeric), కారం వేసి కలుపుకోవాలి.
 

ఇవన్నీ బాగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, గోధుమ రవ్వను నీళ్లు వంపేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడు నీళ్ళు (Water) పోసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి (Cook).
 

కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తరువాత ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి అందులో నెయ్యి (Ghee), తరిగిన కొత్తిమీర వేసి ఇంకోసారి బాగా కలుపుకొని చేయాలి. అంతే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ కిచిడి రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్. ఇది మీ పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు.

click me!