దొండకాయ మసాలా కర్రీ.. మీరు ఎప్పుడైన ట్రై చేశారా?

Published : Jul 20, 2022, 03:03 PM IST

దొండకాయ మసాలా కర్రీ చాలా రుచిగా (Tastefully) ఉంటుంది. వేడివేడి అన్నం, రోటీలతో తీసుకుంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది.  

PREV
16
దొండకాయ మసాలా కర్రీ.. మీరు ఎప్పుడైన ట్రై చేశారా?

ఈ మసాలా కూరను చాలా సులభంగా వండుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం దొండకాయ మసాలా కర్రీ (Dondakaya masala curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
 

26

కావలసిన పదార్థాలు: పావు కిలో దొండకాయలు (Dondakaya), ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), రెండు ఎండు మిరపకాయలు (Dry chillies), రెండు కరివేపాకు (Curry leaves) రెబ్బలు, రెండు టమోటాలు (Tomatoes), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక స్పూన్ కారం (Chilli powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), పావు స్పూన్ పసుపు (Turmeric).
 

36

రెండు యాలకులు (Cardamom), రెండు లవంగాలు (Cloves), రెండు టేబుల్ స్పూన్ ల పల్లీలు (Pallilu), రెండు స్పూన్ ల నువ్వులు (Sesame seeds), ఒక స్పూన్ ధనియాలు (Coriander seeds), సగం స్పూన్ సెనగపప్పు (Senagapappu), సగం స్పూన్ మినపప్పు (Minapappu), పావు స్పూన్ జీలకర్ర (Cumin), పావు స్పూన్ ఆవాలు (Mustard), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, మూడు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

46

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలు, ధనియాలు, నువ్వులు, యాలకులు, లవంగాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి వేగిన తరువాత సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

56

ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఎండు మిరపకాయలు, కరివేపాకు రెబ్బలు, పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని మూత పెట్టే ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. దొండకాయలు వేగిన తరువాత టమోటా ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టే తక్కువ మంట (Low flame) మీద దొండకాయలను  ఉడికించుకోవాలి.
 

66

దొండకాయలు బాగా ఉడికి (Cook well) కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర తరుగు (Chopped coriander) వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.

click me!

Recommended Stories