నోరూరించే స్పైసీ చికెన్ కీమా బుల్లెట్స్ స్నాక్ రెసిపీ.. ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది!

Published : Apr 22, 2022, 03:39 PM ISTUpdated : Apr 22, 2022, 03:40 PM IST

చికెన్ అందుబాటులో ఉన్నప్పుడు చికెన్ కబాబ్, చికెన్ బిర్యానీ వంటి వాటిని ట్రై చేయడం మామూలే. అయితే ఈ సారి కాస్త కొత్తగా చికెన్ కీమా బుల్లెట్స్ ను ట్రై చేయండి.  

PREV
17
నోరూరించే స్పైసీ చికెన్ కీమా బుల్లెట్స్ స్నాక్ రెసిపీ.. ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది!

ఈ స్నాక్స్ రెసిపీ కరకరలాడుతూ (Crispy) కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం చికెన్ కీమా బుల్లెట్స్ (Chicken Keema Bullets) స్నాక్ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: పావు కేజీ చికెన్ కీమా (Chicken Keema), ఒక ఉల్లిపాయ (Onion) తరుగు, రెండు పచ్చిమిరపకాయల (Chilies) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల అల్లం వెల్లుల్లి పేస్టు (Ginger garlic paste), ఒక గుడ్డు (Egg), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice), సగం స్పూన్ మిరియాల పొడి (Pepper powder).
 

37

సగం స్పూన్  గరం మసాలా (Garam masala), సగం స్పూన్ ధనియాల పొడి (Coriander powder), పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక కప్పు బ్రెడ్ పొడి (Bread crumbs), కొత్తిమీర (Coriander) తరుగు, పుదీనా (Mint) తరుగు, వేయించడానికి సరిపడా నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా తరిగిన (Chopped) ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

57

ఇప్పుడు ఇందులో శుభ్రం చేసిన చికెన్ కీమాను వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ కీమా మిశ్రమాన్ని ఇరవై నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు నానబెట్టిన చికెన్ మిశ్రమంలో (Soaked chicken mixture) గుడ్డు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె (Oil) వేసి వేడిచేసుకోవాలి.
 

67

నూనె వేడెక్కేలోపు చికెన్ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న బుల్లెట్ ఆకారంలో (Bullet shaped) చేసుకుని బ్రెడ్ పొడిలో అద్ది బాగా కాగిన నూనెలో వేసి తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇలా మొత్తం చికెను వేయించుకుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కరకరలాడే స్పైసీ చికెన్ కీమా బుల్లెట్స్ రెడీ.
 

77

ఇలా వేడివేడిగా కరకరలాడుతూ ఉండే చికెన్ కీమా బులెట్స్ ను ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ ముక్కలతో సర్వ్ (Serve) చేస్తే భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్ ఐటమ్  (Snack item) మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.

click me!

Recommended Stories