మిక్స్ వెజ్ బటర్ మసాలా ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది.. ఎలా చెయ్యాలంటే?

Published : May 24, 2022, 02:46 PM IST

కూరగాయలతో (Vegetables) చేసుకునే మసాలా కూరలు చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ బటర్ వేసి చేసుకునే మిక్స్ వెజ్ మసాలా కర్రీ రోటీలతో తీసుకుంటే రుచి అదిరిపోద్ది.  

PREV
17
మిక్స్ వెజ్ బటర్ మసాలా ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది.. ఎలా చెయ్యాలంటే?

మీకు ఇష్టమైన కూరగాయలతో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ మసాలా రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మిక్స్ వెజ్ బటర్ మసాలా కర్రీ (Mix Veg Butter Masala Curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: పావు కప్పు బంగాళదుంప (Potato) ముక్కలు, పావు కప్పు బీన్స్ (Beans) ముక్కలు, పది కాలీఫ్లవర్ (Cauliflower) ముక్కలు, క్యాప్సికం (Capsicum) ఒకటి, క్యారెట్ (Carrot) ఒకటి, పావు కప్పు బఠాణీలు (Peas), ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), మూడు టేబుల్ స్పూన్ ల బటర్ (Butter), చిటికెడు పసుపు (Turmeric), సగం టీస్పూన్ ధనియాలపొడి (Coriander powder),
 

37

సగం టీస్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక టీస్పూన్ గరం మసాలా (Garam masala), ఒక టీస్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ (Kashmiri chilli powder), ఒక టీస్పూన్ కసూరి మేథీ (Kasuri Mathi), మూడు టేబుల్ స్పూన్ ల ఫ్రెష్ క్రీమ్ (Fresh cream), పావు కప్పు పన్నీర్  ముక్కలు, ఒక టీస్పూన్ నెయ్యి (Ghee), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

47

మసాలా కోసం: అర ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), రెండు యాలకులు (Cardamom), రెండు లవంగాలు (Cloves), మూడు పెద్ద టమోటాలు (Tomatoes), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), సగం టీస్పూన్ పంచదార (Sugar), ఇరవై జీడిపప్పు (Cashew) పలుకులు, రుచికి సరిపడ ఉప్పు (Salt), మూడు కాశ్మీరీ చిల్లీస్ (Kashmiri Chillies).
 

57

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో జీడిపప్పు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, పంచదార, రుచికి సరిపడా ఉప్పు, కాశ్మీరీ చిల్లీస్, ఒక కప్పు నీళ్లు (Water) పోసి మూతపెట్టి టమోటాలు మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి.
 

67

ఇప్పుడు మరోసారి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేగిన తరువాత రెండు దంచిన యాలకులు, బంగాళాదుంప, క్యారెట్, బీన్స్, బఠాణీలు, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూడు నిమిషాలు తక్కువ మంట (Low flame) మీద మూతపెట్టి ఉడికించుకోవాలి. తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి  పేస్ట్, బటర్ వేసి కూరగాయలు మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

77

ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కసూరి మేథీ వేసి బాగా కలుపుకొని (Mix well) ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ ను వేసి కూర నుంచి బట్టర్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తరువాత పన్నీర్ ముక్కలు ఫ్రెష్ క్రీమ్, నెయ్యి వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే మిక్స్ వెజ్ బటర్ మసాలా రెడీ.

click me!

Recommended Stories