ఈ సారి పల్లీలతో బీరకాయ మసాలా కూరను ట్రై చెయ్యండి. ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం (Method of preparation) కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడూ మనం బీరకాయ మసాలా కర్రీ (Birakaya masala curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
27
బీరకాయ నోటికి రుచిని (Taste) అందించడమే కాదండోయ్.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను (Benefits) అందిస్తుంది. కాబట్టి బీరకాయను ఎక్కువగా వంటల్లో ఉపయోగించడం మంచిది. బీరకాయతో చేసుకునే మసాలా కూర అన్నం, రొట్టెలలోకి బాగుంటుంది.
37
చిటికెడు ఇంగువ (Asparagus), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), రెండు టీ స్పూన్ ల ధనియాల పొడి (Coriander powder), ఒక టేబుల్ స్పూన్ కారం (Chili powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొత్తిమీర (Coriander) తరుగు, మూడు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
47
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు (Fried Peanuts), పచ్చికొబ్బరి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
57
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె (Oil) వేసి వేగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకులు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి.
67
ఉల్లిపాయలు మగ్గిన తరువాత ఇందులో ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లేత బీరకాయ ముక్కలు, ఒక కప్పు నీళ్ళు (Water) పోసి బాగా కలుపుకొని మూత పెట్టి తక్కువ మంట (Low flame) మీద బీరకాయలను బాగా ఉడికించుకోవాలి.
77
తరువాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీమసాలాను వేసి బాగా కలుపుకుని మరికొన్ని నీళ్లు కలుపుకొని మూత పెట్టి తక్కువ మంటమీద కూర నుండి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) లేత బీరకాయ పల్లీ మసాలా కూర రెడీ.