ఒకేచోట కూర్చొని వర్క్.. వెన్ను నొప్పితో బాధపడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..!

Published : Jan 29, 2022, 11:56 AM IST

ఇలా రోజులో దాదాపు 6 నుంచి 7 గంటల పాటు.. కూర్చొని పని చేయడం వల్ల... అనేక సమస్యలు వస్తున్నాయి. అంతెందుకు.. రోజుకి  ఇన్ని గంటలపాటు ఒకే భంగిమలో కూర్చోవడం అనేది...  క్రమం తప్పకుండా సిగరెట్ తాగడంతో సమానమట. 

PREV
15
ఒకేచోట కూర్చొని వర్క్.. వెన్ను నొప్పితో బాధపడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..!

ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి కారణంగా.. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితమయ్యారు. దీంతో.. దాదాపు అందరినీ పని గంటలు పెరిగిపోయాయి. ఆఫీసులకు వెళ్లినా కూడా.. గంటలతరపడి కుర్చీలకు అత్తుకుపోయి పని చేయాల్సి వస్తోంది. ఇలా రోజులో దాదాపు 6 నుంచి 7 గంటల పాటు.. కూర్చొని పని చేయడం వల్ల... అనేక సమస్యలు వస్తున్నాయి. అంతెందుకు.. రోజుకి  ఇన్ని గంటలపాటు ఒకే భంగిమలో కూర్చోవడం అనేది...  క్రమం తప్పకుండా సిగరెట్ తాగడంతో సమానమట.  ఇలా కూర్చోవడం వల్ల.. వెన్ను నొప్పి సమస్యలు రావడం మొదలౌతాయి. మరి దీని నుంచి ఉపశమనం పొందాలంటే  కొన్ని రకాల వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

25
yoga

1.చెస్ట్ ఓపెనర్..

ఈ వ్యాయామం మీ వెనుక , భుజాల కండరాలను వంచడానికి సహాయపడుతుంది. ఛాతీ ఓపెనర్ వ్యాయామం మీ ఛాతీ కండరాలను సాగదీయడానికి , హంచ్డ్ బ్యాక్ సమస్యను తగ్గించడానికి అద్భుతమైనది.
step 1: ముందుగా ఫోటోలో చూపించనట్లుగా.. పాదాలను ముడిచి నిటారుగా కూర్చోవాలి.
step2: ఆ తర్వాత రెండు చేతులను వెనకకు వంచాలి. మీ రెండు చేతులు... కింద నేల భాగాన్ని తాకేందుకు ప్రయత్నించాలి. ఎంత వరకు వంగితే అంత వరకు వెనకకు వంగేలా చేయాలి.

35
yoga

2.​Lunge stretch

ఈ వ్యాయామం చేయడం వల్ల.. మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారౌతుంది. తొడల లోపలి, బయటి కండరాలు బలపడతాయి. కాళ్లతో చేసే ఈ వ్యాయామం కూడా.. ఎంతో ఉపశమనం ఇస్తుంది.

 ముందుగా రెండు పాదాలను వెడల్పుగా చాపాలి. మీ చేతులను హిప్ పై ఉంచి నిలపడాలి. తర్వాత ముందు కుడికాలిని ముందుకు వంచి.. మీ రెండు చేతులను మోకాళ్లపై ఉంచాలి. కొన్ని సెకన్ల పాటు అలానే ఉంచి.. తర్వాత రెండోకాలు ప్రయత్నించాలి.

45
down facing dog

3.​Downward facing dog

ఈ ఆసనం వేయడం వల్ల.. గంటల తరపడి ల్యాప్ టాప్, ఫోన్లు చూడటం వల్ల వచ్చిన మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా నడుము నొప్పి కూడా తగ్గుతుంది. మరి ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం. ఇది ఫోటోలో చూస్తేనే అర్థమైపోతుంది.  ముందుగా.. నిటారుగా నిలపడాలి.

ఆ తర్వాత.. నెమ్మదిగా.. టేబుల్ మాదిరిగా వంగాలి. మోకాళ్లు వంచకుండా.. తల, చేతులను కిందకు ఆనేలా చేయాలి. ఇలా చేయడం మొదటిసారి రాకపోయినా.. ప్రయత్నించగా.. వచ్చేస్తోంది.

55
मरकटासन

4.Spinal twist

ఈ వ్యాయామం మజిల్స్, వెన్నుపూస, మెడ, నడుము నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది వేయడం చాలా సులభం. ముందుగా.. నేలపై నిటారుగా పడుకోవాలి.  ఆతర్వాత.. రెండు చేతులను భుజాలకు సమానంగా చాపాలి. ఆ తర్వాత.. రెండు కాళ్లను ఎడమ వైపు పెట్టి.. తలను కుడివైపు ఉంచాలి.  కొద్ది సెకన్ల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత..రెండు కాళ్లను.. కుడి వైపు పెట్టి.. తలను ఎడమ వైపు తిప్పాలి. ఇది వెన్నుముకకు చాలా మేలు చేస్తుంది.

click me!

Recommended Stories