ఎంతో రుచికరమైన గుజరాతి స్పెషల్ డోక్లా రెసిపీ.. ఎలా చెయ్యాలంటే?

Navya G   | Asianet News
Published : Jan 29, 2022, 02:34 PM IST

గుజరాతి స్పెషల్ (Gujarati Special) రెసిపీ డోక్లా (Dokla) ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ పిల్లలకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
16
ఎంతో రుచికరమైన గుజరాతి స్పెషల్ డోక్లా రెసిపీ.. ఎలా చెయ్యాలంటే?

కావలసిన పదార్థాలు: 250 గ్రాముల సెనగపిండి (Gram flour), ఒక టేబుల్ స్పూన్ ఉప్పు (Salt), ఒకటిన్నర టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice), సగం టీ స్పూన్ బేకింగ్ సోడా (Baking soda), ముప్పావు స్పూన్ ఈనో (Eno), ఒక టేబుల్ స్పూన్ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ (Ginger chilli paste), ఒక టేబుల్ స్పూన్ ఆవాలు  (Mustard), నాలుగు పచ్చిమిరపకాయలు (Green chillies), కరివేపాకు (Curry) రెబ్బలు, ముప్పావు కప్పు పంచదార (Sugar), కొంచెం నూనె (Oil), పావు స్పూన్ ఇంగువ (Hing).
 

26

తయారీ విధానం: 250 గ్రాముల సెనగపిండిని తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు 250 గ్రాముల సెనగపిండికి 400ml నీళ్లను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో రెండున్నర టేబుల్ స్పూన్ పంచదార, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు (Salt) వేసి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగి నీళ్లు నురగగా వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి (Mix well). 
 

36

ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా సెనగపిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత కలుపుకున్న సెనగపిండి మిశ్రమంలో సగం టీ స్పూన్ బేకింగ్ సోడా (Baking soda), ముప్పావు స్పూన్ ఈనో (Eno) వేసి కలుపుకోవాలి.
 

46

ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం, పచ్చిమిర్చిలను సమానంగా తీసుకొని దంచిన పేస్ట్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ రాసుకున్న గిన్నెలో సెనగపిండి మిశ్రమాన్ని ముప్పావు వంతు వరకు వేసి దీన్ని నీళ్లు పోసి మరిగించుకున్న ఫ్యాన్ స్టాండ్ (Stand) పై పెట్టి ఐదు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద, పది నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద కుక్ చేసుకోవాలి.
 

56

ఐదు నిమిషాల తర్వాత అందులో  టూత్ పిక్  గుచ్చి డోక్లా తయారు అయిందో లేదో పరీక్షించాలి. డోక్లా తయారయిన తర్వాత రెండు, మూడు గంటలపాటు డోక్లా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పోపుకోసం ఇప్పుడు మరలా స్టౌ మీద పాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు (Mustard), పావు స్పూన్ ఇంగువ, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు (Curry) వేసి ఫ్రై చేసుకోవాలి.
 

66

ఇప్పుడు ఇందులో ఒకటి ముప్పావు కప్పు నీళ్లు, ముప్పావు కప్పు పంచదార (Sugar) వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతుండగా  వేడిగా ఉన్నప్పుడు డోక్లా మీద కొద్దికొద్దిగా రెండు నిమిషాలకు ఒకసారి  పోయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరితో గార్నిష్ (Garnish) చేసుకుంటే సరే. అంతే డోక్లా రెడీ.

click me!

Recommended Stories