చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్ ఇవే!

First Published Nov 11, 2021, 3:10 PM IST

శీతాకాలంలో (Winter season) గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఆ తేమ కారణంగా మన చర్మానికి అనేక సమస్యలు ఏర్పడతాయి. శీతాకాలంలో ముఖ్యంగా మనకు వేధించే సమస్యలు చేతులు, కాళ్లు, ముఖం పొడిబారిపోవడం, దురదలు మంటలు ఏర్పడుతుంటాయి. అలాగే ముఖంలోని అతి సున్నితమైన భాగం పెదాల పై చర్మం పొడిబారి చీలికలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు శీతాకాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఈ ఆర్టికల్ (Article) ద్వారా మనం శీతాకాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
 

శీతాకాలంలో చలి కారణంగా మనం ఎక్కువ మోతాదులో నీళ్లు (Water) తాగలేము. దీంతో మన చర్మం డీహైడ్రేషన్ (Dehydration) కు గురి అవుతుంది. అప్పుడు మన చర్మం పొడిబారి పోతుంది. మనం ఎన్ని ఆర్టిఫిషియల్ క్రీమ్స్ వాడినా తగిన ప్రయోజనం ఉండదు. కనుక ఎక్కువ మొత్తంలో నీటిని సేవించడం మంచిది.
 

స్నానం తరువాత చర్మానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ (Moisturizing cream) లను అప్లై చేయడం మంచిది. ఇది శరీరానికి తగిన తేమను అందించి చర్మం పొడిబారకుండా చేస్తాయి. నువ్వుల నూనె (Sesame oil) చలికాలంలో చక్కగా పనిచేస్తుంది. ఈ నూనెతో మర్దన చేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 

స్నానం చేశాక ముఖానికి విటమిన్ ఇ (Vitamin E) క్రీములను వాడటం మంచిది. చలికాలంలో ముఖ్యంగా పెదాల పగుళ్ళ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈకాలంలో పెదాలు తొందరగా పొడిబారుతాయి. పెదాలకు చలికాలంలో దొరికే లిప్ బామ్స్ (Lip balms), వెన్నపూస, కొబ్బరి నూనెలను (Coconut oil) అప్లై చేయడం మంచిది. ఇవి వాటికి తగినంత తేమను అందించి పొడిబారకుండా చూస్తాయి.
 

అలాగే శీతాకాలంలో చర్మ సంరక్షణతో పాటు జుట్టు సంరక్షణ కూడా అవసరం. లేకపోతే చుండ్రు (Dandruff), జుట్టు సమస్యలు ఏర్పడి జుట్టు అధిక మొత్తంలో ఊడిపోవడం, తగిన పోషణ లేక నిర్జీవంగా మారిపోతుంది. శీతాకాలంలో (Winter season) జుట్టు కొసలను తరచూ కట్ చేయడం మంచిది. అధిక మొత్తంలో నీరు తీసుకోవాలి.
 

శీతాకాలంలో చర్మ పగుళ్లు అధికంగా ఉంటాయి. కనుక రాత్రి పడుకునే ముందు చర్మానికి వ్యాజిలైన్ (Vaseline) రాసుకోవాలి. చర్మానికి తేమను అందించే మాయిశ్చరైజింగ్ క్రీమ్ లను వాడాలి. చలికాలంలో కాళ్ళకు సాక్సులు (Socks) వాడటం మంచిది. శీతాకాలంలో పాదాల పగుళ్ళు మరింత ఎక్కువగా ఉంటాయి. వీటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.
 

ఫుట్ క్రీమ్స్, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకుని పాదాలకు సాక్సులు వేసుకోవడం మంచిది. శీతాకాలం పొడవునా చల్ల గాలులు ఉంటాయి. కనుక శరీరానికి వేడిని అందించే స్వేటర్లు (Sweaters), సాక్సులు (Socks), గ్లౌస్ లను వాడటం మంచిది. ఇంకా బాదం, ఆలివ్ ఆయిల్ లతో మసాజ్ చేసుకుంటే దురద, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.

click me!