ఎంతో రుచికరమైన నోరూరించే బియ్యప్పిండి లడ్డూలు ఎలా చెయ్యాలో తెలుసా?

First Published Jan 9, 2022, 12:48 PM IST

 సంక్రాంతి స్పెషల్ వంటకాలలో ఏ పిండి పదార్థాలను తయారు చేయాలని ఆలోచిస్తున్నారా! ఎప్పుడు చేసుకునే పిండి వంటకాలు బోర్ కొడుతున్నాయా! అయితే ఈసారి బియ్యప్పిండితో వెరైటీగా లడ్డూలను ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం బియ్యప్పిండి లడ్డూల (Biyappindi laddulu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

బియ్యప్పిండితో తయారు చేసుకునే ఈ లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ లడ్డూల తయారీ విధానం కూడా సులభమే (Easy). ఇందులో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తారు కనుక ఈ లడ్డూలు ఆరోగ్యానికి (Health) కూడా మంచివి. మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలను ట్రై చేయండి. 
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యప్పిండి (Rice Flour), సగం కప్పు పుట్నాలపప్పు (Putnalapappu), సగం కప్పు పల్లీలు (peanuts), రెండు టేబుల్ స్పూన్ ల నువ్వులు (Sesame), పావు కప్పు ఎండు కొబ్బరి తురుము (Dry coconut grater).
 

పావు  స్పూన్ యాలకుల పొడి (cardamom powder), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), ఒక కప్పు బెల్లం (Jaggery), పది జీడిపప్పు (Cashew) పలుకులు, పది బాదం పప్పులు (Almonds), కొన్ని ఎండుద్రాక్షలు (Raisins).   
 

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పల్లీలను (peanuts) వేసి వేయించుకోవాలి. తరువాత పుట్నాలు, నువ్వులు (Sesame), ఎండుకొబ్బరి తురుము ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి విడివిడిగా వేయించుకోవాలి.
 

అలాగే బియ్యప్పిండిని కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పుట్నాలు మిక్సీ జార్ లో వేసి  గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పప్పు పొడి, పల్లీలపొడి, నువ్వులు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసి ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు బెల్లం (Jaggery), పావు కప్పు నీళ్లు పోసి తక్కువ మంట (Low flame) మీద నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకోవాలి.
 

బెల్లం పూర్తిగా కరిగిన (completely melted) తరువాత  రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని వడగట్టి (Filtered) పిండిలో పోసి, ఇందులో బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చుట్టుకోవాలి.
 

అంతే ఎంతో రుచికరమైన (Very tasty) బియ్యప్పిండి లడ్డూలు  రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ లడ్డూలు ఆరోగ్యానికి కూడా మంచివి. ఇలా వెరైటీగా బియ్యప్పిండితో లడ్డూలను తయారు చేసి మీ పిల్లలకు ఇవ్వండి. వారు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడతారు. ఈ లడ్డూలను సంక్రాంతి స్పెషల్ పిండి పదార్థాలుగా కూడా తయారు చేసుకోవచ్చు.

click me!