చిక్కుడు కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూడండి?

First Published Jan 8, 2022, 4:51 PM IST

 చలికాలంలో చిక్కుడు కాయలు (Chikkudukayalu) ఎక్కువగా దొరుకుతాయి. చిక్కుడు కాయలను మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిక్కుడు కాయలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యానికి అందిస్తాయి. అయితే ఇప్పుడు మనం చిక్కుడు కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
 

చాలామంది చిక్కుడుకాయ ను తినడానికి ఇష్టపడరు. కానీ వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే వాటిని తినకుండా ఉండలేరు. చిక్కుడుకాయలలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం, మాంసకృత్తులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్లు (Vitamins) కూడా ఉంటాయి.
 

100 గ్రాముల చిక్కుడుకాయలలో దాదాపు మూడు వందలకు పైగా నీరే ఉంటుంది. వీటిని కూరల రూపంలో అయినా, వీటి గింజలను ఉడికించి అయినా ఇలా ఏదో ఒక విధంగా రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరానికి తగిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఇవి హృద్రోగాలు (Heart diseases), క్యాన్సర్ (cancer) వంటి సమస్యల్లో కూడా దూరం చేస్తాయి.
 

చిక్కుడుకాయలను తీసుకుంటే ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలకు అంది ఎముకలు దృడంగా మారుతాయి. గర్భిణీలు (Pregnant women), బాలింతలు, వ్యాయామం (Exercise) చేసేవారు వీటిని తీసుకోవడం మంచిది. చిక్కుడుకాయలతోపాటు ఎండిన చిక్కుడు గింజలను కూడా కూరల్లో ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో చిక్కుడుకాయలను చేర్చుకోవడం ఉత్తమం.
 

చిక్కుడు కాయలను తింటే ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువును నియంత్రణలో (Weight control) ఉంచుతుంది. ఈ కాయలలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ (Digestive system) ఆరోగ్యంతో పాటు పేగు క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. డయేరియా, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం కారణంగా వచ్చే అనేక వ్యాధులను నివారిస్తాయి.
 

చిక్కుడుకాయలలో ఉండే విటమిన్లు  గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడు కాయలలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను (Lung problems) నివారించడానికి, దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలను (Respiratory problems) తగ్గించడానికి దివ్యౌషధంగా సహాయపడతాయి. ఇందులో ఉండే మాంగనీస్ నిద్రలేమి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

చిక్కుడు కాయలలోని అమైనో ఆమ్లాలు (Amino acids) శరీరంలో హార్మోన్ల సమతౌల్యానికి సహాయపడతాయి. దీంతో మానసిక ఆందోళన (Psychological anxiety) సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇందులో ఉండే పొటాషియం కండరాల వృద్ధికి వాటి పనితీరు కూడా సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీటిని మన ఆహార జీవనశైలిలో అలవరచుకుంటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చు.

click me!