నోరూరించే వేడి వేడి పన్నీర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

Navya G   | Asianet News
Published : Jan 08, 2022, 05:51 PM IST

చలికాలంలో చల్లని సాయంత్రం వేళ  కుటుంబ సభ్యులతో కలిసి కాస్త స్పైసీ (Spicy) గా ఉండే వేడి వేడి స్నాక్స్ వినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు మొదట గుర్తొచ్చేది బజ్జీలు. అయితే ఎప్పుడూ చేసుకునే బజ్జీలకు బదులుగా వెరైటీగా ఈసారి పన్నీరు బోండా లను ట్రై చేయండి. వీటి రుచికి తిరుగుండదు. ఈ బోండాలు తయారీ విధానం చాలా సులభం. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ ద్వారా పన్నీర్ బోండాలు (Paneer bondalu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
17
నోరూరించే వేడి వేడి పన్నీర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: సగం కప్పు సెనగపిండి (Besan), రెండు టేబుల్ స్పూన్ ల బియ్యప్పిండి (Rice flour), రుచికి సరిపడా ఉప్పు (Salt), చిటికెడు వంటసోడా (Baking soda), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
 

27

బొండాల స్టఫింగ్ కోసం: ఒక కప్పు పనీర్ తురుము (Paneer grater), పావు స్పూన్ జీలకర్ర (Cumin seeds), పావు స్పూన్ గరం మసాలా (Garam masala), రెండు పచ్చిమిర్చి (Green chillies), కొత్తిమీర (Coriyander) తరుగు, రుచికి సరిపడా ఉప్పు (Salt).
 

37

తయారీ విధానం: మొదట బొండాల స్టఫింగ్ (Stuffing) కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసి వేగిన తరువాత పన్నీర్, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న కోతిమీర వేసి బాగా కలుపుకొని (Mix well) నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 

47

ఇప్పుడు ఒక గిన్నెలో సెనగ పిండి, కారం, బియ్యప్పిండి, రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా వేసి కలుపుకుని కొద్దికొద్దిగా నీళ్లు (Water) పోస్తూ చిక్కని పిండిలా (Thick flour) తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఢీ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
 

57

ఇప్పుడు పన్నీర్ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని సెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంటలో (Low flame) బాగా ఫ్రై చేసుకున్న బోండాలను ఒక ప్లేట్ (Plate) లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బొండాలుగా తయారు చేసుకోవాలి.
 

67

అంతే వేడి వేడి పన్నీర్ బోండాలు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ బోండాలని మీరు కూడా ట్రై చేయండి. ఇలా రోజు కొత్త కొత్తగా వెరైటీ స్నాక్స్ (Variety snacks) ను తయారు చేసి మీ పిల్లలకు ఇస్తే వారు తినడానికి ఇష్టపడతారు.
 

77

చల్లని సాయంత్రం వేళ పన్నీర్ బోండాలను తింటూ కుటుంబసభ్యులతో కబుర్లు (Gossip) చెప్పుకుంటూ చల్లని సాయంత్రం వేళని ఆస్వాదించండి (Enjoy). బోనాలలో ఉపయోగించే పన్నీర్ పిల్లల ఆరోగ్యానికి మంచిది. కనుక వీటిని ఒకసారి ట్రై చేయండి.

click me!

Recommended Stories