శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ!

First Published Aug 20, 2022, 4:05 PM IST

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని (Water) తగిన మోతాదులో తీసుకోవాలి. అప్పుడే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
 

మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తామో అంతకు రెండింతలు నీటిని తీసుకోవడంపై శ్రద్ధ (Attention) చూపాలి. నీటిని తగిన మోతాదులో తీసుకుంటే శరీర ఆరోగ్యం చాలా బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి నీటిని తీసుకుంటే కలిగే లాభాలు, తాగకపోతే కలిగే అనర్ధాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆహారం లేకపోయినా కొన్ని రోజులైనా జీవించగలం ఏమో కానీ.. నీరు లేకుండా అస్సలు జీవించలేము.. నీరు ఆరోగ్యానికి అంత ముఖ్యం (So important for health) మరి.. నీరు ఆరోగ్యానికి ఇంత అవసరమని తెలిసినా కూడా నీరు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. తగిన మోతాదులో నీటిని తీసుకోవడం పట్ల అశ్రద్ధ (Carelessness) చూపుతారు.
 

ఇలా నీరు తాగకపోవడానికి కారణం (Reason) స్త్రీలు ఇంటి పనిలో నిమగ్గం అయిపోవడం, పురుషులు ఉద్యోగపరమైన పని ఒత్తిడిలో బిజీగా ఉండడం. వీటి కారణంగా శరీరానికి అందవలసిన నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శరీరం అనేక అనారోగ్య సమస్యలను (Health problems) ఎదుర్కొంటుంది.
 

నీటిని తీసుకుంటే కలిగే లాభాలు: రోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలన్ని (Toxic substances) బయటకు వెళ్లి శరీరం శుభ్రపడుతుంది. దీంతో ప్రతి అవయవం పనితీరు (Organ function) మెరుగుపడుతుంది.
 

వేసవిలో అధిక చమట (Sweat) కారణంగా శరీరం కోల్పోయిన నీటి శాతాన్ని తిరిగి అందించగలం. నీటిని తగిన మోతాదులో తీసుకున్నప్పుడు గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే జీర్ణక్రియ (Digestion) సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్దకు సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

అలాగే శరీరంలో రక్తప్రసరణ (Blood circulation) మెరుగుపడి రక్తానికి సరిపడే ఆక్సిజన్ లభిస్తుంది. చర్మం సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గుతాయి. అలాగే రోజంతా హుషారుగా (Smartly) ఉంటారు. నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని మరి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పడి మూత్ర సమస్యలకు దారితీస్తుంది. కనుక నీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

నీరు తాగకపోతే కలిగే అనర్ధాలు: శరీరంలో ఏర్పడే అనేక అనారోగ్య సమస్యలకు కారణం నీరు తక్కువగా తాగడం. నీరు తగిన మోతాదులో తీసుకోకపోవడంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి అవయవాల పనితీరు తగ్గుతుంది (Organ function decreases). దీంతో రోగనిరోధక శక్తి తగ్గి (Reduced immunity) శరీరం నీరసిస్తుంది. 

చాలామంది చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఎక్కువగా నీరు తీసుకోరు. దీంతో శరీరం డిహైడ్రేషన్ (Dehydration) బారినపడుతుంది. ఈ సమస్య చర్మం పొడి బారడం, జుట్టు సమస్యలు, నోటి దుర్వాసన, మెదడు పనితీరు మందగించడం, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలకు (Urinary problems) దారితీస్తుంది.
 

అలాగే ఆకలి మందగించడం (Decreased appetite), జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యలన్నీటికి దూరంగా ఉండాలంటే నీటిని తగిన మోతాదులో తీసుకోండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని (Healthy Life) గడపండి..

click me!