స్వీట్ కార్న్ పన్నీర్ పకోడిని ఎప్పుడైనా ట్రై చేశారా?

Navya G   | Asianet News
Published : Dec 19, 2021, 04:00 PM IST

చలి కాలంలో చల్లటి సాయంత్రాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించాలి అనుకునేవారు టీతో పాటు ఒక మంచి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు ముందుగా పకోడీలు (Pakodi)  గుర్తుకొస్తాయి. అయితే ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే పకోడీలకు బదులుగా స్వీట్ కార్న్ (Sweet Corn)తో పన్నీర్ పకోడీ లను ట్రై చేయండి. దీని తయారీ విధానం చాలా సులభం. ఈ పకోడీలు ఎంతో రుచిగా ఉంటాయి. తక్కువ పదార్థాలతో చేసుకునే స్నాక్స్ ఐటమ్స్ మంచి హెల్దీ స్నాక్స్. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు స్వీట్ కార్న్ పన్నీర్ పకోడీల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

PREV
17
స్వీట్ కార్న్ పన్నీర్ పకోడిని ఎప్పుడైనా ట్రై చేశారా?

కావలసిన పదార్థాలు: ఒక కప్పు స్వీట్ కార్న్ (Sweet corn), పావు కప్పు శెనగపిండి (Besan), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Green chillies), సగం కప్పు పనీర్ తురుము (Paneer grater).
 

27

కరివేపాకు (Curry) తరుగు, కొత్తిమీర (Coriyander) తరుగు, రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ సోంపు (Anise), కొంచెం అల్లం ముక్క (Ginger), ఢీ ఫ్రై కి సరిపడా నూనె (Oil).
 

37

తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ (Mixi Jar) లో ఒక కప్పు స్వీట్ కార్న్, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క వేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.
 

47

ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, శెనగపిండి, సోంపు, ఉప్పు, పనీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇలా కలుపుకున్న పిండి మరి పొడిగా ఉంటే అవసరమైతే ఇందులో కాస్త నీళ్లు (Water) పోసి కలుపుకోవచ్చు.
 

57

ఇప్పుడు పకోడీ తయారీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil) పోయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కలుపుకున్న పిండిని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసి తక్కువ మంట (Low flame) మీద రెండు వైపులా బాగా ట్రై చేసుకోవాలి.
 

67

ఇలా మొత్తం పిండిని పకోడీల్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పకోడీలను ఒక ప్లేట్ లో తీసుకుని టమోటా సాస్ (Tomato sauce) తో సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పన్నీర్ పకోడీ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్నాక్ ఐటం ఒకసారి ట్రై చేయండి.
 

77

తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో చేసుకునే స్నాక్స్ తప్పకుండా మీ పిల్లలకు నచ్చుతుంది. ఇది ఒక మంచి హెల్దీ స్నాక్స్ (Healthy snacks) ఐటమ్. ఈ పకోడీల తయారీలో ఉపయోగించే స్వీట్ కార్న్, పనీర్ ఆరోగ్యానికి మంచిది (Good for health). ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చలి కాలంలో సాయంత్రం వేళ ఈ పకోడీలను తయారుచేసుకొని చల్లటి సాయంత్రాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి.

click me!

Recommended Stories