కాఫీ మాదిరిగానే టీలో ఉండే పాలీఫెనాల్స్ కూడా శోథ నిరోధక, క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నాయని నిరూపించబడింది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
టీ వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే? దీనిలో కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే టీలో థయామిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే టీ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.